Akash Madhwal Records: బుధవారం లక్నోతో జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సంచలన బౌలింగ్‌తో ముంబైని క్వాలిఫయర్‌కు చేర్చాడు యంగ్ పేసర్ ఆకాష్ మధ్వాల్(Akash Madhwal). ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లలో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు ఆకాష్. ఓ రనౌట్ కూడా చేశాడు. అసమాన బౌలింగ్‌తో ముంబైకి తిరుగులేని విజయాన్ని అందించిన ఆకాష్ ఈ క్రమంలో పలు ఐపీఎల్ రికార్డులను తిరగరాశాడు. ఆ రికార్డులు ఏవంటే...
ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ రౌండ్‌లో ఐదు వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా ఆకాష్ నిలిచాడు. 2010 ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ బొల్లింగర్ 13 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ప్లేఆఫ్స్‌లో అతడిదే అత్యుత్తమ బౌలింగ్‌గా నిలిచింది. పదమూడేళ్ల తర్వాత బొల్లింగర్ రికార్డ్‌ను ఆకాష్ బ్రేక్ చేశాడు.
ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో అతి తక్కువ రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లే (Anil Kumble) రికార్డును ఆకాష్ సమం చేశాడు. 2009 ఐపీఎల్‌లో కుంబ్లే ఐదు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. అంతే కాకుండా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌పై బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన ప్లేయర్‌గా ఆకాష్ మధ్వాల్ రికార్డ్ సృష్టించాడు.
వరుసగా రెండు ఐపీఎల్ మ్యాచుల్లో నాలుగుకుపైగా వికెట్లు దక్కించుకున్న ఏకైక బౌలర్‌గా ఆకాష్ మధ్వాల్ నిలిచాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 37 పరుగులు ఇచ్చి
నాలుగు వికెట్లు తీసుకున్న అతడు లక్నోపై ఐదు వికెట్లను సొంతం చేసుకున్నాడు.
అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేసిన ఆటగాడిగా ఆకాష్ నిలిచాడు. గతంలో అంకిత్ రాజ్‌పుత్ 14 రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. అతడి రికార్డ్‌ను ఆకాష్ బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఇరవై ఓవర్లలో 182 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 101 పరుగులకు ఆలౌటై ఐపీఎల్ నుంచి ఇంటిబాట పట్టింది.