IPL 2024 : ఐపీఎల్ 2024 విదేశాలకు షిఫ్ట్.. కారణం ఇదే!-ipl 2024 bcci likely shift ipl out of india because of general elections ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2024 Bcci Likely Shift Ipl Out Of India Because Of General Elections

IPL 2024 : ఐపీఎల్ 2024 విదేశాలకు షిఫ్ట్.. కారణం ఇదే!

Anand Sai HT Telugu
Jul 31, 2023 07:33 AM IST

IPL 2024 : బీసీసీఐ మార్చి, మే మధ్య IPLని పూర్తి చేయవలసి ఉంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ 2024 జూన్ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఐపీఎల్ విదేశాల్లో నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఐపీఎల్​ 2024
ఐపీఎల్​ 2024

IPL 2024 : ఐపీఎల్ అంటే.. ఎక్కడా లేని క్రేజ్. దేశమంతా.. ఐపీఎల్ వైపే చూస్తుంది. భద్రతా విషయంలో ప్రభుత్వాలకు కూడా పెద్ద పని. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్-17 విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలే(General Elections) ఇందుకు ప్రధాన కారణం. అంటే ఐపీఎల్ 2024(IPL 2024)లోగా భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. గతంలో 2009, 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించింది. ఇప్పుడు దీన్ని బట్టి వచ్చే ఐపీఎల్ కూడా విదేశాల్లో జరిగే అవకాశం ఉందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

ఓ వైపు భారత్‌లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనుండగా, మరోవైపు టీ20 ప్రపంచకప్‌(T20 World Cup)కు తేదీ కూడా ఫిక్స్ అయింది. దీని ప్రకారం జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల తేదీ ఖరారైతే, అంతకంటే ముందే ఐపీఎల్ నిర్వహించాల్సి ఉంటుంది.

మార్చి-మే మధ్య ఐపీఎల్‌ను పూర్తి చేయాల్సిన అవసరం బీసీసీఐ(BCCI)కి ఉంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ 2024 జూన్ నుంచి ప్రారంభం కానుంది. మార్చి లేదా మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీసీసీఐ కష్టాల్లో పడుతుంది. దీంతో విదేశాల్లో టోర్నీ నిర్వహించడంపై చర్చ సాగుతోంది.

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ప్రకటిస్తే.. ఐపీఎల్‌కు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించదు. దీంతో చాలా సమస్యలు వస్తాయి. ఇంతకుముందు 2009, 2014లో ఇలాంటి కారణాలతో ఐపీఎల్‌ను విదేశాలకు తరలించారు. ఇప్పుడు మళ్లీ విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించాల్సిన అవసరం బీసీసీఐకి ఎదురైంది.

2009 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ నిర్వహించారు. అలాగే టోర్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా చాలా విజయవంతమైంది. 2014లో టోర్నీ ఫైనల్స్‌ను విదేశాల్లో నిర్వహించారు. ఆ రోజు, ఐపీఎల్ ద్వితీయార్థంలో కొన్ని మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది.

దీని తరువాత, కోవిడ్ -19 నేపథ్యంలో యుఏఈలో ఐపీఎల్ నిర్వహించారు. అందువల్ల ఐపీఎల్‌ను విదేశాలకు తరలించాల్సిన అవసరం ఏర్పడితే యూఏఈ లేదా దక్షిణాఫ్రికాలో టోర్నీ నిర్వహించడం దాదాపు ఖాయం. చూడాలి ఏం జరుగుతుందోనని.

WhatsApp channel