IPL 2023 Total Runs : ఐపీఎల్ 2023.. 74 మ్యాచ్‌ల్లో ఎన్ని పరుగులు చేశారో తెలుసా?
IPL 2023 Records : ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. అయితే ఈసారి ఐపీఎల్ ఎన్నో రికార్డులకు సాక్ష్యంగా నిలిచింది.
ఐపీఎల్ 2023 జోరుగా సాగింది. ఎన్నో రికార్డులు బద్దలు అయ్యాయి. ఈ IPL సీజన్‌లో అత్యధిక సెంచరీలు వచ్చాయి. ఐపీఎల్ 2023లో మొత్తం 153 అర్ధ సెంచరీలు చేశారు ఆటగాళ్లు. ఇలా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు ఆటగాళ్లు. అత్యంత ముఖ్యమైన రికార్డులలో ఒకటి అత్యధిక పరుగులు. అంటే ఈసారి ఐపీఎల్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా పరుగుల వర్షం కురిసింది.
ఈ ఐపీఎల్‌లో మొత్తం 1124 సిక్సర్లు కొట్టారు. ఇది గతంలో కంటే ఎక్కువ. ఐపీఎల్ 2022లో 1062 సిక్సర్లు కొట్టడం ఇప్పటి వరకు రికార్డు. 74 మ్యాచ్‌ల్లో మొత్తం 2172 ఫోర్లు కొట్టారు. 2022లో 8 సెంచరీలు ఓ రికార్డు. కానీ ఈసారి 12 సెంచరీలు వచ్చాయి. ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల్లో 24 వేలకు పైగా పరుగులు చేశారు ఆటగాళ్లు. 2022లో మొత్తం 23,052 పరుగులు చేయడం మునుపటి రికార్డు.
కానీ ఈసారి బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో 74 మ్యాచ్‌ల్లో మొత్తం 24,428 పరుగులు అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో నమోదైన అత్యధిక పరుగులు ఇదే కావడం విశేషం. IPL 16వ సీజన్‌లో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 183. ఐపీఎల్ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు. 2018లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 172.
ఈ ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఓవర్‌కు సగటున 8.99 పరుగులు చేశారు. 2018లో ఓవర్‌కు సగటున 8.65 పరుగులు చేయడం అత్యుత్తమ రికార్డు. ఈ రికార్డు ఇప్పుడు బద్దలైంది. IPL 2023లో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు 8 సార్లు చేజ్ చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఇదే గరిష్ఠం కావడం విశేషం. అంతకుముందు 2014లో 200+ స్కోరును 3 సార్లు ఛేజింగ్ చేయడం రికార్డుగా ఉండేది. ఐపీఎల్ సీజన్‌లో ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బౌలర్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇదే తొలిసారి. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించారు. ఇలా ఈసారి ఐపీఎల్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యాయి.
టాపిక్