IPL 2023 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 కోసం డిసెంబర్ 23న వేలం జరగనుంది. దీనికోసం మొత్తం 991 ప్లేయర్స్ లిస్ట్ నుంచి 405 మందిని ఫ్రాంఛైజీలు షార్ట్‌లిస్ట్ చేశాయి. ఇంతకుముందు 369 మందిని షార్ట్ లిస్ట్ చేయగా.. తాజాగా ఫ్రాంఛైజీలు మరో 36 మందిని ఇందులో చేర్చాల్సిందిగా కోరాయి. దీంతో మొత్తం వేలంలో పాల్గొనే ప్లేయర్స్ సంఖ్య 405కి చేరింది.,ఈసారి మినీ వేలానికి కొచ్చి వేదిక కానుంది. ఈ మొత్తం 405 మంది ప్లేయర్స్‌లో 273 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. 132 మంది విదేశీ ప్లేయర్స్. వీళ్లలో నలుగురు ఐసీసీ అసోసియేట్ దేశాలకు చెందిన వాళ్లు. ఈ మొత్తం 405 మంది ప్లేయర్స్‌లో 119 మంది ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లు. ఇక 282 మంది తమ నేషనల్ టీమ్స్‌కు ఆడని వాళ్లు ఉన్నారు.,ప్రస్తుతం పది ఫ్రాంఛైజీలకు మొత్తం 87 మంది ప్లేయర్స్‌ను తీసుకునే అవకాశం ఉంది. వీళ్లలో 30 వరకూ విదేశీ ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు. ఇక వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ అయిన రూ.2 కోట్లతో 19 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ లేరు. 11 మంది రూ.1.5 కోట్ల కనీస ధరతో ఉన్నారు. ఇక రూ.కోటి బేస్‌ప్రైస్‌తో 20 మంది ఉండగా.. అందులో మయాంక్ అగర్వాల్, మనీష్ పాండేలాంటి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఐపీఎల్ వేలం డిసెంబర్ 23న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది.,రూ.2 కోట్ల లిస్ట్‌లో ప్లేయర్స్: కూల్టర్ నైల్, కామెరాన్ గ్రీన్, ట్రెవిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమాల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్న్, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వెండెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, పూరన్, హోల్డర్.,రూ.1.5 కోట్ల లిస్ట్‌లోని ప్లేయర్స్: సీన్ అబాట్, రైలీ మెరెడిత్, జై రిచర్డసన్, ఆడమ్ జంపా, షకీబుల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జేసన్ రాయ్, షెర్ఫానె రూథర్‌ఫర్డ్,రూ.కోటి లిస్ట్‌లోని ప్లేయర్స్: మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహమాన్, మోయిసిస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, లూక్ వుడ్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసేన్, తబ్రైజ్ షంసి, కుశల్ పెరీరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షాయ్ హోప్, అకీల్ హొస్సేన్, డేవిడ్ వీస్.