IPL 2023 Auction: ఐపీఎల్‌ 2023 ప్లేయర్స్‌ వేలం జరిగేది ఆ రోజే!-ipl 2023 auction to be held in december ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Auction To Be Held In December

IPL 2023 Auction: ఐపీఎల్‌ 2023 ప్లేయర్స్‌ వేలం జరిగేది ఆ రోజే!

Hari Prasad S HT Telugu
Sep 23, 2022 04:06 PM IST

IPL 2023 Auction: ఐపీఎల్‌ 2023 ప్లేయర్స్‌ వేలం కోసం బీసీసీఐ ప్లాన్‌ చేస్తోంది. డిసెంబర్‌లో ఈ వేలం నిర్వహించడానికి సిద్ధమవుతున్న బోర్డు.. ఇప్పటికే ఫ్రాంఛైజీలకు ఓ డేట్‌ కూడా పంపించింది.

డిసెంబర్ లో ఐపీఎల్ 2023 ప్లేయర్స్ వేలం
డిసెంబర్ లో ఐపీఎల్ 2023 ప్లేయర్స్ వేలం

IPL 2023 Auction: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 కు ముందు మెగా ప్లేయర్స్‌ వేలం జరిగిన విషయం తెలుసు కదా. కొత్తగా రెండు టీమ్స్ వచ్చి చేరడంతో రెండు రోజుల పాటు ఈ భారీ వేలం జరిగింది. కొందరు ప్లేయర్స్‌ను రిటేన్‌ చేసుకునే అవకాశం ఇవ్వడంతో వాళ్లు తప్ప మిగతా వందల మంది ప్లేయర్స్‌ను వేలంలోనే ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇక ఇప్పుడు ఐపీఎల్‌ 2023 కోసం మరోసారి వేలం జరగనుంది. ఈసారి మినీ వేలమే నిర్వహించనున్నారు. డిసెంబర్ లో ఈ వేలం జరగనుంది. ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం కూడా పంపించారు. డిసెంబర్‌ 16న ప్లేయర్స్‌ వేలం జరిగే అవకాశం ఉంది. అయితే ఇది ఎక్కడ జరుగుతుందన్నదానిపై స్పష్టత లేదు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌ మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈసారి మళ్లీ హోమ్‌, అవే పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఈసారి ప్లేయర్స్‌ వేలం కోసం ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్ఠంగా ఖర్చు చేసే మొత్తాన్ని రూ.5 కోట్లు పెంచి రూ.95 కోట్లుగా నిర్ణయించారు. ఒకవేళ ఫ్రాంఛైజీలు ఎవరైనా ప్లేయర్స్‌ను వదిలేయడం లేదంటే ఇతర ఫ్రాంఛైజీల నుంచి తీసుకుంటే ఈ మొత్తం మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది.

ఇక ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ నుంచి స్టార్‌ ప్లేయర్‌ రవీంద్ర జడేజాను రిలీజ్‌ చేయడమో లేదంటే మరో టీమ్‌కు ఇవ్వడమో చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఇప్పటికే గుజరాత్‌ టైటన్స్‌తో జడేజాకు బదులుగా శుభ్‌మన్‌ గిల్‌ను చెన్నై టీమ్‌ ట్రేడ్‌ చేసిందన్న వార్తలు కూడా వచ్చాయి. జడేజా కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు జడేజాను వదులుకునే ఉద్దేశం తమకు లేదని కూడా చెన్నై టీమ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇక గుజరాత్‌ టైటన్స్‌ టీమ్‌కు రాహుల్‌ తెవాతియా, ఆర్‌ సాయి కిశోర్‌ల కోసం కూడా ఇతర టీమ్స్‌ను ఆఫర్‌ వచ్చిన ఆ టీమ్‌ తిరస్కరించింది. వేలం తేదీకి ఒక వారం ముందు వరకూ కూడా ట్రాన్స్‌ఫర్‌ విండో ఓపెన్‌ ఉంటుంది.

WhatsApp channel

టాపిక్