IPL Auction 2023 - Sam Curran: ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్ 18.50 కోట్లకు అమ్ముడుపోయాడు. ఈ ఆల్‌రౌండర్‌ను పంజాక్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సామ్ కరన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డ్ 16.25 కోట్లతో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ పేరుమీద ఉంది. ఆ రికార్డ్‌ను సామ్ కరన్ తిరగరాశాడు. రెండు కోట్ల బేస్ ధరతో వేలంలో ఎంటర్ అయ్యాడు సామ్ కరన్.,ఈ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేయడానికి అన్ని ఫ్రాంచైజ్‌లు పోటీపడ్డాయి. తొలుత ముంబాయి ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సామ్ కరన్ ధరను ఆరు కోట్లకు పెంచాయి. ఆ తర్వాత పోటీలోకి రాజస్థాన్ రాయల్స్ వచ్చింది. పది కోట్ల ధర దాటడంతో రాయల్ ఛాలెంజర్స్ పోటీ నుంచి తప్పుకుంది. అనూహ్యంగా రేసులోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ సామ్ కరన్ ను 15.25 కోట్లకు కొనడానికి బిడ్డింగ్ వేసింది.,చివరకు ముంబాయి ఇండియన్స్ 18 కోట్లు చెల్లించడానికి సిద్ధపడింది. కానీ సామ్ కరన్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన పంజాబ్ చివరకు 18. 50 కోట్లకు అతడిని సొంతం చేసుకున్నది. గతంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు సామ్ కరన్.,కామెరూన్ గ్రీన్ - 17.5 కోట్లుఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డ్ ధర పలికాడు. అతడిని ముంబై ఇండియన్స్ ఏకంగా రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. గ్రీన్‌ను సొంతం చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ గట్టిగానే ఫైట్ చేసినా.. చివరికి ముంబై గ్రీన్‌ను కొనుగోలు చేసింది.,బెన్ స్టోక్స్ - 16.25 కోట్లుఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా జట్టుకు ఉపయోగపడే ఆటగాడు కావడంతో అతడిని కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ రెండు ఫ్రాంచైజ్‌లలో ఎవరో ఒకరు బెన్ స్టోక్స్‌ను కొనుగోలు చేస్తారని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో బిడ్‌లోకి ఎంటరైన చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లతో స్టోక్స్‌ను దక్కించుకున్నది.,నికొలస్ పూరన్- రూ.16 కోట్లువెస్టిండీస్ కెప్టెన్ నికొలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. రెండు కోట్ల బేస్ ధరతో ఐపీఎల్‌లోకి ఎంటరైన అతడికి ఊహించని జాక్‌పాట్ తగిలింది. నికొలస్ పూరన్‌ను కొనుగోలు చేసేందుకు చివరి వరకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జోటీపడ్డాయి. చివరకు అతడిని లక్నో దక్కించుకుంది.