ఐపీఎల్ 2023
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. షార్ట్‌గా ఐపీఎల్. ప్రపంచ క్రికెట్ గతిని మార్చిన ఈ మెగా లీగ్ 16వ సీజన్ ప్రారంభం కాబోతోంది. సమ్మర్‌లో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించడానికి మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ లీగ్ జరగనుంది. ఈసారి కూడా 10 టీమ్స్ లీగ్‌లో పార్టిసిపేట్ చేస్తుండగా.. మూడు సీజన్ల తర్వాత మళ్లీ హోమ్, అవే పద్ధతిలో మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన అహ్మదాబాద్ లోని నరేంద్ర్ మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ ఇప్పటికే 15 సీజన్ల పాటు జరగగా.. ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ తలా ఒక టైటిల్ గెలిచాయి.
2023 సీజన్‌లో ప్రతి టీమ్ సొంతగడ్డపై ఏడు, బయట మరో ఏడు మ్యాచ్ లు ఆడతాయి. మొత్తం 12 వేదికల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. అహ్మదాబాద్ తో పాటు హైదరాబాద్, మొహాలీ, లక్నో, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గువాహటి, ధర్మశాలలో ఐపీఎల్ 2023 మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తంగా 52 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్ లు ఉంటాయి. అందులో 18 డబుల్ హెడర్స్ ఉంటాయి.
లీగ్ స్టేజ్ మే 21న ముగుస్తుంది. మే 28న ఫైనల్ జరుగుతుంది. పది జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. గ్రూప్ ఎలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఇక గ్రూప్ బిలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ ఉన్నాయి.
తక్కువ చూపండిఇంకా చదవండిరాబోయే మ్యాచులు
రిజల్ట్ మ్యాచెస్
లేటెస్ట్ న్యూస్
పాయింట్ల పట్టిక
పూర్తి కవరేజీ చూడండిPos | Team | PLD | Won | Lost | Tied | N/R | NRR | Pts |
---|---|---|---|---|---|---|---|---|
1 | ![]() | 14 | 10 | 4 | 0 | 0 | +0.809 | 20 |
2 | ![]() | 14 | 8 | 5 | 0 | 1 | +0.652 | 17 |
ఐపీఎల్ రికార్డులు
ఐపీఎల్ 2023 వీడియోలు
ఐపీఎల్ 2023 లీడర్ బోర్డు
- ప్లేయర్స్
- టీమ్స్
ఆరేంజ్ క్యాప్

Shubman Gill
Gujarat Titans
890రన్స్
పర్పల్ క్యాప్

Mohammad Shami
Gujarat Titans
28వికెట్లు