Football: ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్‌గా భారత ఫుట్‌బాల్ జట్టు-intercontinental cup indian football team won final match against lebanon ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Football: ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్‌గా భారత ఫుట్‌బాల్ జట్టు

Football: ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్‌గా భారత ఫుట్‌బాల్ జట్టు

Anand Sai HT Telugu
Jun 19, 2023 10:40 AM IST

Intercontinental Cup : భారత ఫుట్ బాల్ టీమ్ ఇంటర్ కాంటినెంటల్ కప్ గెలిచింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ తన 87వ గోల్ సాధించాడు. దిగ్గజ ఆటగాళ్ల సరసన చేరాడు.

ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్‌గా భారత్
ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్‌గా భారత్ (twitter)

ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం భువనేశ్వర్‌లో జరిగిన ఫైనల్లో భారత్ 2-0తో లెబనాన్‌(Lebanon)ను ఓడించి ఇంటర్‌కాంటినెంటల్ కప్‌ను గెలుచుకుంది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ తన 87వ అంతర్జాతీయ గోల్‌ను సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

భారత్‌ తరఫున లాలియన్‌జులా చాంగ్టే మరో గోల్‌ చేసి జట్టును మంచి స్థితిలో ఉంచాడు. 2018 ప్రారంభ ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో టైటిల్. 2019లో కొరియా ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో భారత్ విజయం అంత సులువు కాదు. తొలి అర్ధభాగంలో లెబనాన్ జట్టు భారత్‌కు(India Vs Lebanon) గట్టి పోటీ ఇచ్చింది. ఈ సమయంలో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. దీంతో తొలి అర్ధభాగం 0-0తో ముగిసింది. కానీ రెండో పీరియడ్‌లో భారత జట్టు దూకుడు ప్రదర్శించి సత్తా చాటింది.

సెకండాఫ్‌లోనూ, ఆరంభంలోనూ ఇరు జట్లు అద్భుతంగా పోరాడాయి. ఈ సందర్భంగా భారత జట్టుకు అనుభవజ్ఞుడైన ఆటగాడు, కెప్టెన్ సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) తొలి గోల్ చేశాడు. కీలక సమయంలో భారత కెప్టెన్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసి భారత జట్టుకు విజయాన్ని అందించాడు. మెుదట భారత్ 1-0తో ముందు ఉంది.

ఈ గోల్ తర్వాత భారత్ ఆట మరింత దూకుడుగా మారింది. తద్వారా మ్యాచ్‌లో పూర్తి పట్టు సాధించింది. ఫలితంగా భారత్ తొలి గోల్ చేసిన 20 నిమిషాల్లోనే మరో గోల్ సాధించింది. లాలియన్జులా చాంగ్టే మరోసారి బంతిని గోల్ పోస్ట్ లోపలికి నెట్టడంలో సఫలమయ్యాడు. దీని ద్వారా మ్యాచ్ ను భారత్‌ తన అధీనంలోకి తెచ్చుకోవడంలో విజయం సాధించింది.

టాపిక్