Carlos Alcaraz: ఫెదరర్, జకోవిచ్ పై రికార్డుపై కన్ను.. కట్ చేస్తే అల్కరాజ్ కు భారీ షాక్.. మూడేళ్లలో ఫస్ట్ ఓటమి-indian wells atp masters jack draper ended carlos alcarazs bid book a title clash with holger rune ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Carlos Alcaraz: ఫెదరర్, జకోవిచ్ పై రికార్డుపై కన్ను.. కట్ చేస్తే అల్కరాజ్ కు భారీ షాక్.. మూడేళ్లలో ఫస్ట్ ఓటమి

Carlos Alcaraz: ఫెదరర్, జకోవిచ్ పై రికార్డుపై కన్ను.. కట్ చేస్తే అల్కరాజ్ కు భారీ షాక్.. మూడేళ్లలో ఫస్ట్ ఓటమి

Carlos Alcaraz: ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీలో వరుసగా రెండు సార్లు ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ కు దిమ్మతిరిగే షాక్. మూడేళ్లలో తొలిసారి అతను ఈ టోర్నీలో ఓడాడు. బ్రిటన్ కుర్రాడి చేతిలో పరాజయం పాలయ్యాడు.

ఓటమి తర్వాత డ్రేపర్ తో చేతులు కలుపుతున్న అల్కరాజ్ (IMAGN IMAGES via Reuters Connect)

ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ 1000 టెన్నిస్ టోర్నీలో అరుదైన ఇన్సిడెంట్ జరిగింది. గత రెండేళ్లుగా ఈ టోర్నీలో తిరుగులేని కార్లోస్ అల్కరాజ్ కు ఫస్ట్ టైం షాక్ తగిలింది. ఇండియన్ వెల్స్ 2025 టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీస్ లో అల్కరాజ్ కు బ్రిటన్ ఆటగాడు జాక్ డ్రేపర్ షాకిచ్చాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ డ్రేపర్ 6-1, 0-6, 6-4 తేడాతో అల్కరాజ్ ను ఓడించి కెరీర్ లో తొలి మాస్టర్స్ 1000 ఫైనల్ కు చేరుకున్నాడు.

మరో సెమీస్ లో 13వ ర్యాంకర్ డెన్మార్క్ ఆటగాడు రూనె 7-5, 6-4తో ప్రపంచ ఆరో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ పై విజయం సాధించాడు. టైటిల్ పోరులో రూనె తో డ్రేపర్ తలపడబోతున్నాడు.

16 విజయాలు

ఇండయన్ వెల్స్ టెన్నిస్ టోర్నీలో గత రెండేళ్లుగా అల్కరాజ్ కు తిరుగేలేదు. ఈ టోర్నీలో ఈ ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ వరుసగా 16 మ్యాచ్ లు గెలిచాడు. కానీ ఆ విన్నింగ్ స్ట్రీక్ కు ఇప్పుడు డ్రేపర్ ఎండ్ కార్డు వేశాడు. మెరుపు సర్వీస్ లతో డ్రేపర్ అదరగొట్టాడు. డ్రేపర్ జోరు ముందు తేలిపోయిన అల్కరాజ్ తొలి సెట్లో ఒక్క గేమ్ మాత్రమే గెలిచాడు.

కానీ రెండో సెట్లో అల్కరాజ్ పుంజుకున్నాడు. డ్రేపర్ కు ఒక్క గేమ్ గెలిచే ఛాన్స్ ఇవ్వకుండా సెట్ ముగించాడు. కానీ నిర్ణయాత్మక మూడో సెట్లో డ్రేపర్ దే పైచేయి. అల్కరాజ్ నుంచి కాస్త పోటీ ఎదురైనా డ్రేపర్ ఛాంపియన్ గా నిలిచాడు.

ఫెదరర్, జకోవిచ్ మాత్రమే

ఈ ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా మూడు సార్లు గెలిచిన ఆటగాళ్లుగా రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ నిలిచారు. ఈ సారి కూడా టైటిల్ సొంతం చేసుకుని ఈ లెజెండ్స్ సరసన చోటు దక్కించుకోవాలనే అల్కరాజ్ చూశాడు. కానీ అతని కలకు డ్రేపర్ అడ్డుగా నిలిచాడు.

‘‘నేను ఏ మ్యాచ్ లోనూ ఓడిపోవాలని అనుకోను. ఇది నాకు మరింత ప్రత్యేకంగా నిలవాలని అనుకున్నా. కానీ చాలా కష్టంగా గడిచింది. మ్యాచ్ హోరాహోరీగా సాగింది’’ అని అల్కరాజ్ పేర్కొన్నాడు.

ఫస్ట్ టైం

ఇండియన్ వెల్స్ ఫైనల్ చేరిన జాక్ డ్రేపర్ కు ఇదే ఫస్ట్ 1000 మాస్టర్స్ టోర్నీ టైటిల్ క్లాష్. ఈ బ్రిటన్ ఆటగాడు అల్కరాజ్ తో మ్యాచ్ లో గొప్ప ప్రదర్శన చేశాడు.

‘‘నిజంగా చెప్పాలంటే ఇదో స్ట్రేంజ్ మ్యాచ్. కార్లోస్ కాస్త ఫ్లాట్ గా ఆడాడు. అది గ్రహించా. నా ఛాన్స్ ను ఉపయోగించుకున్నా. మూడో సెట్లో పోటీపడ్డ తీరు పట్ల గర్వపడుతున్నా’’ అని డ్రేపర్ తెలిపాడు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం