ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించింది. హెడ్ కోచ్ గా గంభీర్ ఓ ట్రోఫీ అందించాడు. ఈ విజయంతో దేశమంతా ఊగిపోయింది. ఈ విజయాన్ని ఎంజాయ్ చేసిన గంభీర్.. ఇప్పుడు దొరికిన ఖాళీ టైమ్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు. ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తాజాగా తన వైఫ్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై గంభీర్ సహచర ఆటగాడు, దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2025 జరుగుతున్న నేపథ్యంలో గంభీర్ కు ఖాళీ టైమ్ దొరికింది. దీంతో భార్యా, పిల్లలతో కలిసి గంభీర్ వెకేషన్ కు వెళ్లాడు. టెన్షన్ ను దూరం పెట్టి.. ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు. తన వైఫ్ తో దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. దీనికి యువరాజ్ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. హిందీలో “తు న హసియో (నీవు నవ్వవు)’’ అని కామెంట్ పెట్టాడు. వైఫ్ తో దిగిన ఫొటోలనూ గంభీర్ నవ్వకుండా ఉండటమే ఇందుకు కారణం. గంభీర్ ఎప్పుడూ సీరియస్ లుక్ లోనే కనిపిస్తాడనే సంగతి తెలిసిందే.
గంభీర్ సీరియస్ ముఖంపై యువరాజ్ వ్యంగ్యంగా కామెంట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. 2020లో గంభీర్.. “2003 నుండి సోషల్ డిస్టెన్సింగ్” అనే శీర్షికతో సీరియస్ ఫేస్ తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. అప్పుడు యువరాజ్ “ఇక్కడ ఉన్న ఏకైక నవ్వు ఎమోజీ!” అని వ్యాఖ్యానించాడు.
గంభీర్, యువరాజ్ మధ్య సంబంధం చాలాకాలం నాటిది. ఇద్దరూ దీర్ఘకాలం పాటు సీనియర్ పురుషుల జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నారు. ఈ జంట భారతదేశం 2007 టీ20 ప్రపంచకప్ విజయం, నాలుగు సంవత్సరాల తరువాత వన్డే ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్రలు పోషించారు.
గంభీర్ ఇండియా-ఎ జట్టుతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళవచ్చని తెలుస్తోంది. ఇది సీనియర్ జట్టు పర్యటనకు ముందు జరుగుతుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్.. ఇంగ్లండ్ లో ఐదు టెస్టులు ఆడనుంది. కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ ద్వయం ఇటీవల టెస్ట్ క్రికెట్‌లో నిరాశపరిచే ప్రదర్శన ఎదుర్కొన్నారు. న్యూజిలాండ్‌తో హోమ్ సిరీస్‌లో వైట్‌వాష్ (0-3), అలాగే ఆస్ట్రేలియాలోని బార్డర్-గావస్కర్ ట్రోఫీలో 3-1 ఓటమిని టీమ్ ఎదుర్కొంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం టీమ్ ను విజేతగా నిలిపారు.
సంబంధిత కథనం