IND vs NZ 1st T20 Toss: తొలి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా - పృథ్వీషాకు నో ఛాన్స్‌-india won the toss chose to field in 1st t20 match against new zealand ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /   India Won The Toss Chose To Field In 1st T20 Match Against New Zealand

IND vs NZ 1st T20 Toss: తొలి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా - పృథ్వీషాకు నో ఛాన్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 27, 2023 06:38 PM IST

IND vs NZ 1st T20 Toss:రాంచీ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. ఈ టీ20 మ్యాచ్‌తో పృథ్వీషా రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగినా అత‌డికి తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు.

హార్దిక్ పాండ్య‌
హార్దిక్ పాండ్య‌

IND vs NZ 1st T20 Toss: ఇండియా - న్యూజిలాండ్ మ‌ధ్య టీ20 స‌మ‌రం మొద‌లైంది. రాంచీ వేదిక‌గా శుక్ర‌వారం జ‌రుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

వ‌న్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ ఇండియా టీ20 సిరీస్‌లో ఫేవ‌రేట్‌గా బ‌రిలో దిగుతోంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠికి ఛాన్స్ ద‌క్కింది. పృథ్వీషా రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగినా అత‌డికి తుది జ‌ట్టులోకి తీసుకోలేదు.

చాహ‌ల్‌ను ప‌క్క‌న‌పెట్టి స్పిన్న‌ర్‌గా కుల్దీప్‌ యాద‌వ్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఆల్ రౌండ‌ర్స్ స్థానాన్నిహార్దిక్ పాండ్య‌తో పాటు దీప‌క్ హుడా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇండియా టీమ్ ఇదే

ఇషాన్ కిష‌న్‌, శుభ్‌మ‌న్ గిల్‌, రాహుల్ త్రిపాఠి, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్య‌, దీప‌క్ హుడా, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, శివ‌మ్ మావి, కుల్దీప్ యాద‌వ్‌, ఉమ్రాన్ మాలిక్‌, హార్ష‌దీప్ సింగ్‌

WhatsApp channel