IND vs SA T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పొట్టి ప్రపంచకప్‌లో రెండు విజయాలతో జోరుమీదున్న టీమ్ ఇండియా సౌతాఫ్రికాపై విజయాన్ని సాధించి సెమీస్ బెర్తు దక్కించుకోవాలని ఆశపడుతోంది.,నేటి మ్యాచ్‌లో మరోమారు విరాట్ కోహ్లి చెలరేగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు సౌతాఫ్రికాతో మ్యాచ్ ఓపెనర్ కె.ఎల్ రాహుల్‌కు కీలకంగా మారింది. అతడు ఎలా ఆడుతున్నాది ఆసక్తికరంగా మారింది.,ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రయోగాల జోలికి పోకుండా గత మ్యాచ్‌లలో ఆడిన ప్లేయర్స్‌ను కొనసాగించింది. దినేష్ కార్తిక్ స్థానంలో రిషబ్ పంత్‌కు స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ కార్తిక్‌పైనే రోహిత్ మరోసారి నమ్మకం ఉంచాడు. మరోవైపు సౌతాఫ్రికా ఒక మార్పు చేసింది. షంసీ స్థానంలో లుంగి ఎంగిడిని తుది జట్టులోకి తీసుకున్నది.