Telugu News  /  Sports  /  India Womens Team Beat Sri Lanka To Win 7th Asia Cup Title
స్మృతి మంధాన‌
స్మృతి మంధాన‌

INDW vs SLW Asia Cup Final: ఆసియా క‌ప్ విజేత‌గా ఇండియా - ఫైన‌ల్‌లో లంక‌ను చిత్తు చేసిన ఉమెన్స్ టీమ్

15 October 2022, 15:40 ISTNelki Naresh Kumar
15 October 2022, 15:40 IST

INDW vs SLW Asia Cup Final: ఆసియా క‌ప్ విజేత‌గా భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో శ్రీలంక‌పై ఇండియా ఉమెన్స్ టీమ్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

INDW vs SLW Asia Cup Final: ఆసియా క‌ప్ విజేత‌గా ఇండియా ఉమెన్స్ టీమ్ నిలిచింది. శ‌నివారం శ్రీలంక‌తో జ‌రిగిన ఫైన‌ల్‌ మ్యాచ్‌లో భార‌త మ‌హిళా జ‌ట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఉమెన్స్ టీమ్ 65 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. పేస‌ర్ రేణుక సింగ్ ధాటికి శ్రీలంక బ్యాట‌ర్లు విల‌విల‌లాడారు. మూడు ఓవ‌ర్లు వేసి ఐదు ప‌రుగులు ఇచ్చిన రేణుక సింగ్ మూడు వికెట్లు తీసింది. గైక్వాడ్, స్నేహ్ రాణా త‌లో రెండు వికెట్లు తీశారు.

ట్రెండింగ్ వార్తలు

66 ప‌రుగుల ల‌క్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా స్మృతి మంధాన మెరుపుల‌తో ఎనిమిది ఓవ‌ర్ల‌లోనే విజ‌యాన్ని అందుకున్న‌ది. స్మృతి మంధాన‌ 25 బాల్స్‌లోనే మూడు సిక్స‌ర్లు, ఆరు ఫోర్ల‌తో 51 ర‌న్స్ చేసింది. 8.3 ఓవ‌ర్ల‌లో టీమ్ ఇండియా 71 ర‌న్స్ చేసింది.

షెఫాలీ వ‌ర్మ‌, రొడ్రిగ‌స్ విఫ‌ల‌మైన హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌తో క‌లిసి స్మృతి మంధాన టీమ్ ఇండియాకు విజ‌యాన్ని అందించింది. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌ ప‌ద‌కొండు ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచింది. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఆసియా క‌ప్ విజేత‌గా నిల‌వ‌డం ఇది ఏడోసారి కావ‌డం గ‌మ‌నార్హం. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా దీప్తి శ‌ర్మ‌, ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రేణుక సింగ్‌కు అవార్డులు ద‌క్కాయి.

టాపిక్