India vs Spain Hockey World Cup: హాకీ వరల్డ్‌కప్‌లో ఇండియా, స్పెయిన్‌ మ్యాచ్‌ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?-india vs spain hockey world cup match when and where to watch ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  India Vs Spain Hockey World Cup Match When And Where To Watch

India vs Spain Hockey World Cup: హాకీ వరల్డ్‌కప్‌లో ఇండియా, స్పెయిన్‌ మ్యాచ్‌ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ఇండియన్ హాకీ టీమ్
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ఇండియన్ హాకీ టీమ్ (Naveen Patnaik Twitter)

India vs Spain Hockey World Cup: హాకీ వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా, స్పెయిన్‌ మ్యాచ్‌ శుక్రవారం (జనవరి 13) జరగనుంది. తొలి రోజు మరో మూడు మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో ఇండియా, స్పెయిన్‌ మ్యాచ్‌ కూడా ఒకటి. మరి ఈ మ్యాచ్‌ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

India vs Spain Hockey World Cup: ఇండియన్‌ హాకీ టీమ్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా శుక్రవారం (జనవరి 13) తొలి మ్యాచ్‌ ఆడనుంది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత బ్రాంజ్‌ మెడల్‌ గెలిచి మళ్లీ ఆశలు రేపిన మన టీమ్‌.. ఇప్పుడు వరల్డ్‌కప్‌లో ఏం చేస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. 48 ఏళ్లుగా వరల్డ్‌కప్‌లో ఇండియాకు అసలు ఎలాంటి మెడల్‌ దక్కలేదు.

ట్రెండింగ్ వార్తలు

ఒకప్పుడు 8 ఒలింపిక్‌ మెడల్స్‌తో ప్రపంచ హాకీని ఏలిన ఇండియన్‌ టీమ్‌ తర్వాత అసలు ఒలింపిక్స్‌కు అర్హత సాధించని దుస్థితికి కూడా దిగజారింది. కానీ గత టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి ఇప్పుడు మరోసారి ఆశలు రేపుతోంది. 1971లో తొలిసారి జరిగిన వరల్డ్‌కప్‌లో బ్రాంజ్‌, 1973లో సిల్వర్‌ మెడల్‌ గెలిచింది. 1975లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత కనీసం సెమీస్‌ కూడా చేరలేదు. ఈ నేపథ్యంలో స్వదేశంలో వరుసగా రెండోసారి జరుగుతున్న వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ ఆడటానికి ఇండియన్‌ టీమ్‌ సిద్దమైంది. స్పెయిన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.

ఇండియా vs స్పెయిన్‌.. ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

ఇండియా, స్పెయిన్‌ మ్యాచ్‌ ఒడిశాలోని రూర్కెలాలో కొత్తగా నిర్మించిన బిర్సా ముండా ఇంటర్నేషనల్‌ హాకీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమువుతుంది. ఈ మ్యాచ్‌ను టీవీల్లో చూడాలనుకుంటే స్టార్‌ స్పోర్ట్స్‌ ఫస్ట్‌, స్టార్ స్పోర్ట్స్ సెలక్ట్‌ 2, స్టార్‌ స్పోర్ట్స్‌ సెలక్ట్‌ 2 హెచ్‌డీ ఛానెల్స్‌లో చూడొచ్చు. ఇక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై చూడాలనుకుంటే డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ లైవ్‌ స్ట్రీమింగ్ ఉంటుంది. అన్ని వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు కూడా ఈ ఛానెల్స్‌లోనే ప్రసారమవుతాయి.

స్పెయిన్‌తో మ్యాచ్‌కు ఇండియా టీమ్‌

హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్‌), అభిషేక్‌, సురేందర్‌ కుమార్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, జర్మాన్‌ప్రీత్‌ సింగ్‌, మణ్‌దీప్‌ సింగ్‌, లలిత్‌ ఉపాధ్యాయ్‌, కృషన్‌ పాఠక్‌, నీలమ్ సంజీప్‌, పీఆర్‌ శ్రీజేష్‌, నీలకంఠశర్మ, షంషేర్‌ సింగ్‌, వరుణ్ కుమార్‌, ఆకాశ్‌దీప్‌ సింగ్‌, అమిత్‌ రోహిదాస్‌, వివేక్‌ సాగర్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌

సంబంధిత కథనం

టాపిక్