Ind vs NZ 3rd T20I Weather Forecast: మూడో టీ20కి వర్షం ముప్పుందా? వాతావరణ నివేదిక ఏం చెబుతోంది?-india vs new zealand 3rd t20i weather forecast what are the chances of rain in ahmedabad ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Vs New Zealand 3rd T20i Weather Forecast What Are The Chances Of Rain In Ahmedabad

Ind vs NZ 3rd T20I Weather Forecast: మూడో టీ20కి వర్షం ముప్పుందా? వాతావరణ నివేదిక ఏం చెబుతోంది?

Maragani Govardhan HT Telugu
Feb 01, 2023 09:06 AM IST

Ind vs NZ 3rd T20I Weather Forecast: న్యూజిలాండ్-భారత్ మధ్య బుధవారం సాయంత్రం జరగనున్న మూడో టీ20 అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ పిచ్‌పై స్పిన్నర్లకు, స్లో పేసర్లకు అనుకూలించే అవకాశముంది.

భారత్-న్యూజిలాండ్
భారత్-న్యూజిలాండ్ (PTI)

Ind vs NZ 3rd T20I Weather Forecast: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ గెలిచేందుకు భారత్ నేడు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా ఉండటంతో ఈ గేమ్‌పై ఉత్కంఠ పెరిగింది. తొలి మ్యాచ్‌లో ఓడిన హార్దిక్ సేన.. రెండో టీ20లో పుంజుకుని సిరీస్ సమం చేసింది. దీంతో నిర్ణాయత్మక మూడో మ్యాచ్ కీలకం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

బుధవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాల్లో తేమ 35 నుంచి 45 శాతంగా ఉండనుంది. మంచు 7 డిగ్రీల సెల్సియస్‌గా ఉంండవచ్చు. ఆకాశం నిర్మలంగా ఉంది. వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువ. పూర్తి మ్యాచ్ జరుగుతుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. గాలివేగం గంటకు సుమారు 10 కిలోమీటర్లుగా ఉంది.

పిచ్ రిపోర్టు..

నరేంద్రమోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలోని పిచ్‌పై ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ నాలుగింటిలో నెగ్గింది. పర్యాటక జట్టు రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. కాబట్టి గెలుపునకు భారత్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిచ్ స్పిన్నర్లు, స్లో బౌలర్లకు అనుకూలించనుంది. బ్యాటర్లకూ సహకరించనుంది. కాబట్టి 20 ఓవర్లలో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. సగటును ఈ పిచ్ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 174 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ ఆడిన జట్టు 166 పరుగులు చేసింది.

లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో పిచ్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా రెండో టీ20లో తక్కువ పరుగుల లక్ష్య ఛేదనలోనూ టీమిండియా ఇబ్బంది పడింది. దీంతో పిచ్ క్యూరేటర్ వేటు పడింది. పాత వ్యక్తి స్థానంలో సీనియర్ క్యూరేటర్ అయిన సంజీవ్ కుమార్‌ను భర్తీ చేశారు. మరి నిర్ణయాత్మకమైన మూడో టీ20లో భారత్-న్యూజిలాండ్‌లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

WhatsApp channel

సంబంధిత కథనం