India vs Bangladesh 2nd Test Day 3: ఇండియా టాప్ ఆర్డ‌ర్ విఫ‌లం - ర‌స‌వ‌త్త‌రంగా రెండో టెస్ట్‌ -india vs bangladesh 2nd test day 3 stumps india need 100 runs to win against bangladesh ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  India Vs Bangladesh 2nd Test Day 3 Stumps India Need 100 Runs To Win Against Bangladesh

India vs Bangladesh 2nd Test Day 3: ఇండియా టాప్ ఆర్డ‌ర్ విఫ‌లం - ర‌స‌వ‌త్త‌రంగా రెండో టెస్ట్‌

ఇండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌
ఇండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌

India vs Bangladesh 2nd Test Day 3: ఇండియా - బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రుగుతోన్న రెండో టెస్ట్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. మూడో రోజు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 231 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. ఇండియా ముందు 145 ప‌రుగుల ల‌క్ష్యాన్ని విధించింది. స్వ‌ల్ప టార్గెట్‌ను ఛేదించే క్ర‌మంలో 45 ప‌రుగుల‌కు టీమ్ ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయింది.

India vs Bangladesh 2nd Test Day 3: ఇండియా - బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రుగుతోన్న రెండో టెస్ట్ ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 231 ప‌రుగుల‌కు బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. ఇండియా ముందు 145 ప‌రుగుల ల‌క్ష్యాన్ని విధించింది. ఈజీ టార్గెట్‌ను ఛేదించే క్ర‌మంలో టీమ్ ఇండియా టాప్ ఆర్డ‌ర్ త‌డ‌బ‌డింది.

ట్రెండింగ్ వార్తలు

45 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి మూడు రోజును ముగించింది. ప్ర‌స్తుతం అక్ష‌ర్ ప‌టేల్ 26 ర‌న్స్‌, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ 3 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్‌ను త‌క్కువ ప‌రుగుల‌కే ఆలౌట్ చేసిన ఆనందం టీమ్ ఇండియాకు ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. బంగ్లా బౌల‌ర్ మెహ‌దీ హ‌స‌న్ విజృంభించ‌డంతో టీమ్ ఇండియా టాప్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది.

తొలుత కెప్టెన్ కె.ఎల్ రాహుల్‌ను 2 ప‌రుగుల‌కు ష‌కీబ్ ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత ఫామ్‌లో ఉన్న శుభ్‌మ‌న్ గిల్‌, పుజారాల‌ను మెహ‌దీ హ‌స‌న్ పెవిలియ‌న్ పంపించాడు. విరాట్ కోహ్లి కూడా ఒక ప‌రుగుకే ఔట్ అయ్యి నిరాశ‌ప‌రిచాడు. ఈ టెస్ట్‌లో టీమ్ ఇండియా విజ‌యాన్ని సాధించాలంటే ఇంకా 100 ప‌రుగులు చేయాలి. రెండో రోజు రిష‌బ్ పంత్‌పైనే ఆశ‌లు ఎక్కువ‌గా ఉన్నాయి.