India vs Bangladesh 1st Test Day 3: గిల్‌, పుజారా సెంచరీల మోత.. బంగ్లాదేశ్‌ ముందు భారీ లక్ష్యం-india vs bangladesh 1st test day 3 gill and pujara hit hundreds ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Vs Bangladesh 1st Test Day 3 Gill And Pujara Hit Hundreds

India vs Bangladesh 1st Test Day 3: గిల్‌, పుజారా సెంచరీల మోత.. బంగ్లాదేశ్‌ ముందు భారీ లక్ష్యం

Hari Prasad S HT Telugu
Dec 16, 2022 03:36 PM IST

India vs Bangladesh 1st Test Day 3: గిల్‌, పుజారా సెంచరీల మోత మోగించారు. దీంతో బంగ్లాదేశ్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. ఈ మ్యాచ్‌పై పూర్తిగా పట్టు బిగించింది.

సెంచరీలతో చెలరేగిన పుజారా, శుభ్ మన్ గిల్
సెంచరీలతో చెలరేగిన పుజారా, శుభ్ మన్ గిల్ (AFP)

India vs Bangladesh 1st Test Day 3: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆ టీమ్ ముందు ఏకంగా 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 150 రన్స్‌కే ఆలౌటైనా.. ఫాలోఆన్‌ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇండియన్‌ టీమ్‌.. 2 వికెట్లకు 258 స్కోరు దగ్గర డిక్లేర్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

తొలి ఇన్నింగ్స్‌ 254 పరుగుల ఆధిక్యం కలుపుకొని మొత్తం 512 రన్స్‌ లీడ్‌లో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, పుజారా సెంచరీల మోత మోగించారు. గిల్‌కు టెస్టుల్లో ఇదే తొలి సెంచరీ కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో మిస్‌ అయిన సెంచరీని రెండో ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు పుజారా. అతడు సెంచరీ చేయగానే కెప్టెన్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.

పుజారా 102 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. అతడు తొలి ఇన్నింగ్స్‌లోనూ 90 రన్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక శుభ్‌మన్‌ గిల్‌ 110 రన్స్‌ చేసి ఔటయ్యాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌ కంటే రెండో ఇన్నింగ్స్‌లో ఇండియన్‌ బ్యాటర్లు సులువగా బ్యాటింగ్‌ చేశారు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (23) మరోసారి నిరాశ పరిచినా.. పుజారా తన టాప్‌ ఫామ్‌ కొనసాగించాడు.

ఇక ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా అత్యధిక స్కోరర్‌గా ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ కూడా అదే జోరు మరోసారి ప్రదర్శించాడు. ఈ టెస్ట్‌లో మరో రెండు రోజుల ఆట పూర్తిగా మిగిలి ఉంది. మూడో రోజు కూడా 12 ఓవర్లు ఉండటంతో మ్యాచ్‌ గెలవడానికి టీమిండియాకు మంచి అవకాశాలు ఉన్నాయి.

WhatsApp channel