India vs Australia 1st ODI: ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఊహించని విధంగా కుప్పకూలింది. మిడిలార్డర్ వైఫల్యంతో కేవలం 188 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 65 బంతుల్లోనే 81 పరుగులు చేయడంతో ఒక దశలో 300కుపైగా స్కోరు సులువుగా చేస్తుందని భావించినా.. కేవలం 19 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది.,ఇండియన్ పేస్ బౌలర్లు మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఆస్ట్రేలియా కనీసం 200 స్కోరు కూడా చేయలేకపోయింది. మిచెల్ మార్ష్ 81 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జోష్ ఇంగ్లిస్ 26, స్టీవ్ స్మిత్ 22 రన్స్ చేశారు. ఆల్ రౌండర్లు గ్రీన్ (12), మ్యాక్స్‌వెల్ (8), మార్కస్ స్టాయినిస్ (5) దారుణంగా విఫలమయ్యారు.,ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్లోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5)ను బౌల్డ్ చేశాడు మహ్మద్ సిరాజ్. మంచి స్టార్ట్ దక్కింది కదా అనుకునేలోపే మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు ఓవర్ కు ఆరుకుపైగా రన్‌రేట్ తో 72 పరుగులు జోడించారు.,ముఖ్యంగా మార్ష్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఆ సమయంలో పిచ్ బ్యాటింగ్ కు చాలా ఈజీగా కనిపించింది. అయితే టీమ్ స్కోరు 129 పరుగులు దగ్గర మార్ష్ ను జడేజా ఔట్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. 169 రన్స్ దగ్గర ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత మరో 19 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లనూ పారేసుకుంది.,ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో హార్దిక్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతడు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. ఇక రోహిత్ స్థానంలో గిల్ తో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేయనున్నాడు. కేఎల్ రాహుల్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు వస్తాడు.,