India vs Australia 1st ODI: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఇక ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోంది. శుక్రవారం (మార్చి 17) ముంబైలో తొలి వన్డే జరగనుండగా.. రెండు టీమ్స్ స్టాండిన్ కెప్టెన్లతోనే బరిలోకి దిగుతున్నాయి. ఇండియాకు హార్దిక్ పాండ్యా, ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ కెప్టెన్లుగా ఉన్నారు.,వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ తొలి వన్డేకు దూరమవడంతో హార్దిక్ స్టాండిన్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా తన తుది జట్టును అంచనా వేశాడు. అన్ని ఫార్మాట్లలోనూ టాప్ ఫామ్ లో ఉన్న గిల్ తో కలిసి ఎవరు ఓపెనింగ్ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.,రోహిత్ వచ్చిన తర్వాత ఎలాగూ అతడే వస్తాడు. అయితే తొలి వన్డేలో మాత్రం ఇషాన్ కు చోటు దక్కనుంది. జాఫర్ ఎంపిక చేసిన టీమ్ ప్రకారం.. గిల్, ఇషాన్ ఓపెనింగ్, మూడోస్థానంలో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా రానున్నారు. ఇక జాఫర్ తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు.,జడేజాతోపాటు సుందర్, కుల్దీప్ లు ఉంటారని అంచనా వేశాడు. పేస్ బౌలింగ్ భారాన్ని షమి, సిరాజ్ మోయనున్నారు. ఉమ్రాన్ మాలిక్ కు చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. నా ప్లేయర్ ఎలెవన్ ఇదీ అంటూ జాఫర్ 11 మంది పేర్లను ట్వీట్ చేశాడు. ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డే శుక్రవారం (మార్చి 17) జరగనుండగా.. మార్చి 19న వైజాగ్ లో, మార్చి 22న చెన్నైలో జరగనున్నాయి.,జాఫర్ ఎంపిక చేసిన తుది జట్టు ఇదేశుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్,