టెస్ట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయడం ఏ క్రికెటర్‌కైనా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. మొదటిసారి సుదీర్ఘ ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ప్రత్యేకమైన సందర్భం. ఆటగాళ్ల స్వభావాన్ని, సహనం, బలం, ఏకాగ్రతను కూడా పరీక్షిస్తుంది. అందుకే, టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాడు భారీ స్కోరును కొట్టడం చాలా అరుదు. క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్ట్ ఆడే దేశాల్లో భారత్ ఒకటి అయినప్పటికీ, కేవలం ముగ్గురు క్రికెటర్లు మాత్రమే తమ అరంగేట్రంలో 150 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇంతకీ ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరు?
యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) ఈ జాబితాలోకి వచ్చిన కొత్త పేరు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చాడు. డొమినికా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 387 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 171 పరుగులు చేశాడు. 150 పరుగులు చేసే వరకు ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్ ఈ సమయంలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. భారత్ తరఫున అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు.
రోహిత్ శర్మ(Rohit Sharma) భారత క్రికెట్ జట్టు తరఫున తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే 150కి పైగా పరుగులు చేసిన ఆటగాడు. అతను 2007 T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగం. ODI క్రికెట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాడు. 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే అరంగేట్రం మ్యాచ్‌లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 177 పరుగులు చేశాడు.
అరంగేట్రంలోనే 150కి పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా శిఖర్ ధావన్(shikhar dhawan) నిలిచాడు. 2013లో పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై ధావన్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో 187 పరుగులు చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.