Brathwaite On 2nd Test : వర్షం రాకపోతే గెలిచేవాళ్లం.. వెస్టిండీస్ కెప్టెన్
IND Vs WI 2nd Test Brathwaite Comments : వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు ఈ విషయంపై వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ కామెంట్స్ చేశాడు.
వెస్టిండీస్‌లో పర్యటించిన భారత్.. టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో టెస్టు చివరి రోజు భారత్ చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. ఈ దశలో వెస్టిండీస్ విజయానికి 289 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్‌పై సరిగా ఆడని.. బ్రాత్ వైట్ ఇప్పుడు గెలిచేవాళ్లమని కామెంట్స్ చేస్తున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిన తర్వాత బ్రాత్‌వైట్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ టెస్టులో మా పోరాట పటిమను కనబరిచామని చెప్పాడు.
'భారత్‌పై బ్యాట్‌తో మంచి పోరాటం చేశాం. బౌలింగ్‌లో మేం కాస్త మెరుగ్గా రాణించాల్సి వచ్చింది. అయితే తొలి టెస్టులో ఆడిన తీరు నుంచి రెండో టెస్టులో బ్యాట్స్‌మెన్ మంచి పునరాగమనాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇరవై పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయాం. టెస్టు మ్యాచ్‌ల్లో బాగా ఆడాలని కోరుకుంటున్నాం.' అని బ్రాత్ వైట్ అన్నాడు.
చివరి రోజు 289 పరుగులను విజయవంతంగా ఛేదిస్తామని నమ్మకంతో ఉన్నామని విండీస్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని వెల్లడించాడు. కానీ వర్షం కారణంగా మాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదని వాపోయాడు.
'ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అన్ని పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. కానీ ఇక్కడ మేము మా బ్యాటింగ్‌ను మెరుగుపరచుకోవడానికి ప్రాక్టీస్‌ను కొనసాగిస్తాం. ఈ టెస్టులో మా జట్టులోని ఇద్దరు బ్యాట్స్‌మెన్ బాగా ఆడారు. డిసెంబర్‌లో ఆస్ట్రేలియా టూర్ జరగనున్నందున, ఆ టోర్నీకి అత్యుత్తమంగా సన్నద్ధమవుతాం.' అని చెప్పాడు బ్రాత్ వైట్.
ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్ పార్క్ ఓవల్‌లో రెండో టెస్టు వర్షం కారణంగా రద్దు చేశారు. టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనుకున్న భారత్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఆఖరి రోజు ఆట సాధ్యంకాకుండా డ్రా అయింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకుంది. భారత్ విజయానికి ఎనిమిది వికెట్ల దూరంలో ఉండగా, సిరీస్ సమం చేయడానికి వెస్టిండీస్ 5వ రోజు 289 పరుగులు చేయాల్సి ఉంది. ఆదివారం 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. ఆట చివరికి 76/2తో ముగించింది. విండీస్ జట్టుకు.. ఇంకా 289 పరుగులు కావాల్సి ఉండేది.
నాలుగో రోజు.. వర్షం కారణంగా దాదాపు ఒక సెషన్ ఆటకు నష్టం వాటల్లింది. చివరి రోజు అయినా వరుణుడు దయ చూపిస్తాడనుకుంటే.. వర్షం ఇబ్బంది పెట్టింది. ఆటగాళ్లు గ్రౌండులోకి రాకుండా చేసింది. దీంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించేశారు. ఈ కారణంగా 1-0తో సిరీస్ రోహిత్ సేన సొంతమైంది.