IND VS WI 1st Test : అశ్విన్ 'స్పిన్' మాయాజాలం.. భారత్‌కు ఇన్నింగ్స్ విజయం
IND VS WI 1st Test : వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది.
డొమినికా వేదికగా ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్టు మ్యాచ్(IND Vs WI Test Match)లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25కు మంచి ఆరంభం దక్కింది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది. 312/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను మెుదలెపెట్టిన భారత్.. 425/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
మెుదటి ఇన్నింగ్స్ లో 271 పరుగుల ఆధిక్యంతో ఉంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన వెస్టిండీస్ జట్టు.. అశ్విన్ మాయాజాలంతో 130 పరుగులకే కుప్పకూలింది. 71 పరుగులు ఇచ్చిన అశ్విన్ 7 వికెట్లు తీశాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 150 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్రంలోనే శతకంతో ఆకట్టుకున్నాడు యశస్వి జైస్వాల్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రెండో టెస్టు జులై 20న ప్రారంభమవుతుంది.
అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లోను తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. త్యాన్ నారాయణ్ చందర్ పాల్(7)ను జడేజా ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత క్రెయిగ్ బ్రాత్ వైజ్(7) అశ్విన్ చేతిలో ఔటయ్యాడు. టీ బ్రేక్ వరకు 27/2తో ఉన్న వెస్టిండీస్.. చివరి సెషన్లో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరి సెషన్ మెుదట్లోనే బ్లా్క్ వుడ్(5) అశ్విన్ చేతిలో ఔటయ్యాడు. కొద్దిసేపటికే.. రీఫర్(11) జడేజా చేతికి చిక్కాడు. దసిల్వా(13) సిరాజ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.
విండీస్ రెండో ఇన్నింగ్స్ లో చివరి ఐదు వికెట్లు అశ్విన్ ఖాతాలోకి చేరాయి. అథనేజ్(28) స్లిప్ లో యశస్వి జైస్వాల్ కు చిక్కాగా.. అలార్జీ జోసెఫ్(13) శుభ్ మన్ గిల్ కు క్యాచ్ ఇచ్చాడు. రఖీమ్ కార్నవాల్(4), కీమర్ రోచ్(0) ఓకే ఓవర్లో ఔట్ కావడం విశేషం. దీంతో మూడో రోజు నిర్ణీత ఓవర్లు ముగిశాయి. ఆలౌట్ కు విండీస్ అడుగుదూరంలో ఉంది. ఈ క్రమంలో అరగంట సేపు మ్యాచ్ పొడిగించారు. కానీ చివర్లో మూడు ఫోర్లు బాదిన వారికన్(18) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో విండీస్ ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్ లో భారత ప్లేయర్లలో యశస్వి జైస్వాల్(171 పరుగులు 387 బంతుల్లో) మెుదటి మ్యాచ్ లోనే ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ(103 పరుగులు 221 బంతుల్లో) సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ(76 పరుగులు 182 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేశాడు. జడేజా(37 పరుగులు 82 బంతుల్లో, నాటౌట్) కూడా రాణించాడు.
వెస్టిండీస్ ప్లేయింగ్ స్క్వాడ్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), టాగెనరైన్ చంద్రపాల్, రేమాన్ రైఫర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజీ, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, రహీం కార్న్‌వాల్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారిక్ మెక్‌కెన్ బెంచ్ : షానన్ గాబ్రియేల్
టీమ్ ఇండియా ప్లేయింగ్ స్క్వాడ్: రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సవి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్తు, శ్రీకర్ సిరాజ్తు భరత్, అక్షర్ పటేల్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్