IND vs SA 2nd Odi: నేడు ఇండియా, సౌతాఫ్రికా రెండో వన్డే - సిరీస్ ఆశలను ధావన్ సేన నిలుపుకుంటుందా?
IND vs SA 2nd Odi: రాంచీ వేదికగా నేడు ఇండియా, సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే జరుగనున్నది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని టీమ్ ఇండియా బరిలో దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఉన్న బలహీనతల్ని అధిగమిస్తూ టీమ్ ఇండియా విజయాన్ని సాధిస్తుందా లేదా అన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
IND vs SA 2nd Odi: రాంచీ వేదికగా నేడు సౌతాఫ్రికాతో రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకునేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. తొలి వన్డేలో విజయం ముగింట టీమ్ ఇండియా బోల్తా కొట్టింది. తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆ తప్పులను పునరావృతం చేయకుండా ఆడి సిరీస్ ఆశలను నిలబెట్టుకోవాలని ధావన్ సేన ప్రయత్నిస్తోంది.
తొలి వన్డేలో కెప్టెన్ ధావన్‌తో పాటు శుభ్‌మన్‌గిల్(Shubman gill,) రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ విఫలమయ్యారు. టాప్ ఆర్డర్ విఫలం కావడమే తొలి వన్డేలో టీమ్ ఇండియా ఓటమికి కారణమైంది. వారు ఆటతీరుపైనే రెండో వన్డే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్(Sanju Samson) ఆసమాన ఆటతీరును కనబరిచారు. నేటి మ్యాచ్‌లో వారు బ్యాట్ ఝులిపించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
బౌలింగ్ టీమ్ ఇండియాకు పెద్ద సమస్యగా మారింది. టీ20 సిరీస్‌లో రాణించిన దీపక్ చాహర్ గాయం కారణంగా మిగిలిన వన్డేలకు దూరమయ్యాడు. సిరాజ్, ఆవేష్‌ఖాన్ భారీగా పరుగులు ఇస్తున్నారు. వారి బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆడారు. వారికి మరో అవకాశం దక్కుతుందా లేదా అన్నది అనుమానమే. ఇద్దరిలో ఒకరిని పక్కనపెట్టి షాబాజ్ అహ్మద్, ముఖేష్ కుమార్‌లకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోన్నాయి.
శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ తుది జట్టులో ఉండవచ్చునని అంటున్నారు. మరోవైపు టీ20 సిరీస్‌లో రాణించిన డికాక్, మిల్లర్ తొలి వన్డేల్లో సౌతాఫ్రికాను ఆదుకున్నారు. వారితో పాటు క్లాసెన్ రాణించాడు. మరోసారి ఈ ముగ్గురిపైనే సౌతాఫ్రికా ఆశలు పెట్టుకున్నది. నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది.