Ind vs NZ 3rd t20 highlights: ఇండియా, న్యూజిలాండ్‌ మూడో టీ20 టై.. సిరీస్‌ ఇండియా సొంతం-ind vs nz 3rd t20 highlights as match end up in tie after rain interrupts and india win the series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ind Vs Nz 3rd T20 Highlights As Match End Up In Tie After Rain Interrupts And India Win The Series

Ind vs NZ 3rd t20 highlights: ఇండియా, న్యూజిలాండ్‌ మూడో టీ20 టై.. సిరీస్‌ ఇండియా సొంతం

Hari Prasad S HT Telugu
Nov 22, 2022 04:05 PM IST

Ind vs NZ 3rd t20 highlights: ఇండియా, న్యూజిలాండ్‌ మూడో టీ20 మ్యాచ్‌ టై అయింది. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డు పడటంతో ముందుగానే నిలిపేశారు. ఆ సమయానికి ఇండియా డీఎల్‌ఎస్‌ పద్ధతిలో స్కోరును సమం చేసింది.

వర్షం పడే సమయానికి స్కోరు సమం చేసి సిరీస్ గెలిచిన ఇండియా
వర్షం పడే సమయానికి స్కోరు సమం చేసి సిరీస్ గెలిచిన ఇండియా (AP)

Ind vs NZ 3rd t20 highlights: ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను ఇండియా 1-0తో గెలిచింది. ఈ మ్యాచ్‌లో 161 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా 9 ఓవర్లలో 75 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో నేపియర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో అంపైర్లను మ్యాచ్‌ను ఆపేశారు. చాలాసేపటి తర్వాత కూడా వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ను అక్కడితోనే నిలిపేశారు. అప్పటికి ఇండియా డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం స్కోరును సమం చేసింది. దీంతో మ్యాచ్ టై అయినట్లు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

టార్గెట్‌ చేజింగ్‌లో ఇండియా రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోయింది. వచ్చీరాగానే భారీ షాట్లకు ప్రయత్నించిన ఓపెనర్లు రిషబ్‌ పంత్‌ (11), ఇషాన్‌ కిషన్‌ (10), సూర్యకుమార్‌ (13), శ్రేయస్‌ అయ్యర్‌ (0) విఫలమయ్యారు. దీంతో ఒక దశలో 21 పరుగులకే 3 వికెట్లు కోల్పయి కష్టాల్లో పడింది. ఈ దశలో హార్దిక్‌, సూర్య టీమ్‌ను ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 39 రన్స్‌ జోడించారు. అయితే ఈ సమయంలో భారీ షాట్‌ ఆడబోయి సూర్య ఔటయ్యాడు. దీంతో 60 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

9 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా 4 వికెట్లకు 75 రన్స్‌ చేసిన సమయంలో భారీ వర్షం కురిసింది. ఆ సమయానికి ఇండియా డీఎల్‌ఎస్‌ పద్ధతిలో సరిగ్గా స్కోరును సమం చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మహ్మద్ సిరాజ్ కు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సూర్యకుమార్ యాదవ్ కు దక్కాయి.

చివర్లో చెలరేగారు

అంతకుముందు న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. నేపియర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కివిస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. రెండో టీ20 ఓటమితో డిలా పడిన ఆతిథ్య జట్టు.. చివరి మ్యాచ్‌లో ఫైటింగ్ స్కోరు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే(59), గ్లెన్ ఫిలిప్స్(54) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో డారిల్ మిచెల్ మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 4 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు శుభారంభమేమి దక్కలేదు. రెండో ఓవర్లోనే అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్(3) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్‌మన్‌(12)తో కలిసి ఇన్నింగ్స్ ముందుగు నడిపించే ప్రయత్నం చేశాడు ఓపెనర్ డేవాన్ కాన్వే. వీరిద్దరూ రెండో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని సిరాజ్ మార్క్‌ను ఔట్ చేసి విడదీశాడు.

అనంతరం డేవాన్ కాన్వే-గ్లెన్ ఫిలిప్స్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు వేగాన్ని పంచారు. ఈ క్రమంలోనే అర్ధశతకాలను పూర్తి చేశారు. గ్లెన్ ఫిలిప్స్ 33 బంతుల్లో 54 పరుగులు చేయగా.. డేవాన్ కాన్వే 49 బంతుల్లో 59 పరుగులు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 84 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే దూకుడుగా ఆడుతున్న గ్లెన్‌ను సిరాజ్ ఔట్ చేసి మ్యాచ్ మలుపు తిప్పాడు.

అనంతరం కాసేపటికే డేవాన్‌ అర్షదీప్ పెవిలియన్ చేర్చారు. వీరిద్దరూ ఔట్ కావడంతో కివీస్ ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. ఒకానొక దశలో 2 వికెట్లకు 130 పరుగులతో బలమైన స్థితిలో ఉన్న న్యూజిలాండ్ చివరకు వరుసగా వికెట్లను కోల్పోయి అనుకున్నన్నీ పరుగులు చేయలేక ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు చివర్లో అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా షమీ నాలుగు వికెట్ల కెరీర్ బెస్ట్(4/17) పర్ఫార్మెన్స్ చేశాడు. మరో బౌలర్ అర్షదీప్ సింగ్ కూడా నాలుగు వికెట్లతో(4/37) ఓపెనర్లతో పాటు కివీస్ తోక తెంచాడు.

అర్ష్‌దీప్ వేసిన 19వ ఓవర్లో 3 వికెట్ల పడ్డాయి. ముందు డారిల్ మిచెల్‌ను ఔట్ చేసిన అర్ష్‌దీప్.. ఆ తదుపరి బంతికే ఇష్ సోదీని బౌల్డ్ చేశాడు. ఆ తదుపరి బంతికి మిల్నే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆఖరు ఓవర్‌లో హర్షల్ పటేల్ సౌదీని బౌల్డ్ చేయడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది.

WhatsApp channel