IND Vs NZ 2nd T20 : రెండో టీ20లో ఏమైనా మార్పులు ఉన్నాయా?-ind vs nz 2nd t20 predicted playing xi and match other details ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ind Vs Nz 2nd T20 Predicted Playing Xi And Match Other Details

IND Vs NZ 2nd T20 : రెండో టీ20లో ఏమైనా మార్పులు ఉన్నాయా?

Anand Sai HT Telugu
Jan 29, 2023 06:44 AM IST

IND Vs NZ 2nd T20 : భారత్ vs న్యూజిలాండ్ మూడు టీ20ల సిరీస్‌లో 0-1తో వెనకబడిన టీమ్ ఇండియాకు రాబోయే రెండు మ్యాచ్‌లు కీలకం. మరి రెండో టీ20 ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? తదితర వివరాలు ఏంటో చూద్దాం.

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో వైఫల్యంతో ఓడిపోయిన భారత్ ఇప్పుడు రెండో సమరానికి సిద్ధమైంది. తొలి టీ20లో టీమ్ ఇండియా ఆరంభంలో ధీటుగా బౌలింగ్ చేసినా డెత్ ఓవర్లలో పరుగుల వర్షం కురవడంతో వెనక్కి తగ్గింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం కూడా పేలవంగానే ఉంది. సూర్యకుమార్(Surya Kumar), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) పోరాటానికి ఫలితం దక్కలేదు. మూడు టీ 20ల సిరీస్‌లో 0-1తో వెనుకబడిన టీమ్‌ఇండియా(Team India)కు వచ్చే రెండు మ్యాచ్‌లు చాలా కీలకం.

ట్రెండింగ్ వార్తలు

జనవరి 29 ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ఉండనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

తొలి టీ20లో ఓటమి పాలైన నేపథ్యంలో.. రెండో మ్యాచ్‌కి టీమ్‌ఇండియాలో మార్పు ఉంటుందని కొంతమంది అంటున్నారు. 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఆయన స్థానంలో ముఖేష్‌ కుమార్‌ని తీసుకురావొచ్చు. రాహుల్ త్రిపాఠి స్థానంలో పృథ్వీ షా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 1 వికెట్ తీయడంతో యుజ్వేంద్ర చాహల్ మళ్లీ బెంచ్ పై నిరీక్షించాల్సి వచ్చింది. అయితే మార్పులు ఏమైనా ఉంటాయో.. లేదో మాత్రం క్లారిటీ లేదు.

అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలోని బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఇది మళ్లీ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఆట చివరి దశలలో ఫాస్ట్ బౌలర్లకు కాస్త కలిసి రావొచ్చు. అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావవంతంగా ఉంటారు.

టీమ్ ఇండియా : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్

న్యూజిలాండ్ జట్టు : మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), డేన్ క్లీవర్, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బెంజమిన్ లిస్టర్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రిప్పన్, హెన్రీ రిప్పన్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్.

WhatsApp channel

సంబంధిత కథనం