ICC Test ranking: నువ్వా-నేనా..! నెంబర్ వన్ ర్యాంక్ రేసులో అశ్విన్, అండర్సన్
ఐసీసీ ప్రకటించిన బౌలింగ్ ర్యాంకింగ్ లో ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ తాజాగా టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. టెస్ట్ బౌలింగ్ ర్యాకింగ్ లో స్టార్ బౌలర్ల మధ్య ర్యాంకింగ్ కోసం తీవ్ర పోటీ ఉంటుంది. గత వారం ప్రకటించిన బౌలింగ్ ర్యాకింగ్ లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ను వెనక్కి నెట్టి.. అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు టీం ఇండియా వెటరన్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్ జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇద్దరు బౌలర్లు సమాన పాయింట్లు సాధించారు. టీం ఇండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ సమాన పాయింట్లు సాధించారు. దీంతో ఇద్దరి మధ్య నెక్ టూ నెక్ తీవ్రమైన పోటీ నెలకొంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్లో నాలుగు పాయింట్లు తగ్గాయి. ప్రస్తుతం 859 పాయింట్ల వద్ద అశ్విన్ కొనసాగుతున్నాడు. అండర్సన్ కూడా 859 పాయింట్లు వద్దే ఉన్నాడు.
మరోవైపు టీం ఇండియాతో జరిగిన చివరి రెండు టెస్టులకు కమిన్స్ గైర్హాజరు అయ్యాడు. అతని రేటింగ్ 849 పాయింట్లకు పడిపోయింది. అయినప్పటికీ కమిన్స్ స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేదు. ఇప్పటికీ ర్యాంకింగ్స్‌లో కమిన్స్ మూడవ స్థానంలోనే కొనసాగుతున్నాడు. అయితే అశ్విన్, అండన్ సన్ తో పోల్చితే కమిన్స్ చాలా దూరంలో ఉన్నాడు.
అటు మిగిలిన ఆటగాళ్ల పరిస్థితి చూస్తే… టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్ ని బాగానే పెంచుకున్నారు. దక్షిణాఫ్రికా పేసర్ రబడా 3 స్థానాలు మెరుగుపరుచుకొని నాల్గవ స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా టాప్ 10లో స్థానాన్ని సంపాందించుకున్నాడు. భారత్‌తో జరిగిన మూడో టెస్టులో 11 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాని గెలిపించటంలో నాథన్ కీలకపాత్ర వహించాడు. మొత్తం ఐదు స్థానాలు మెరుగుపడి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.
మరోవైపు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ర్యాంకింగ్ లో మార్పు చేర్పులు వచ్చాయి. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ బ్యాటింగ్ జాబితాలో మొత్తం ఐదు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. దీంతో 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కెప్టెన్ జోస్ బట్లర్ నాలుగు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌కు ఎగబాకాడు. డేవిడ్ మలన్ 22 స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కు పాకాడు.