వావ్.. నేపాలీ క్రికెటర్ ‘పుష్ప' సెలబ్రేషన్.. ఐసీసీ ఎలా రియాక్టయిందో చూడండి!
పుష్ప స్టైల్ సెలబ్రేషన్ రాష్ట్రాలే కాదు.. ఏకంగా దేశాలు, ఖండాలు కూడా దాటిపోయింది. తగ్గేదేలే అంటూ క్రికెటర్లు చేసుకుంటున్న ఈ పుష్ప సెలబ్రేషన్స్‌పై ఐసీసీ కూడా రియాక్టైంది.
దుబాయ్: పుష్ప మూవీలో అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ చెప్పే డైలాగ్, ఆ మేనరిజం ఓ రేంజ్‌లో పాపులర్ అయిపోయింది. గల్లీల్లో పిల్లల నుంచి ఇంటర్నేషనల్ లెవల్ క్రికెట్, ఫుట్‌బాల్ ప్లేయర్స్ వరకూ అందరూ ఈ స్టైల్‌ను ఫాలో అవుతున్నారు. సినిమా వచ్చి వెళ్లి చాలా రోజులే అవుతున్నా.. ఇప్పటికీ కొంతమంది పుష్ప సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
ఇన్నాళ్లూ జడేజా, పాండ్యాలాంటి మగ క్రికెటర్లే ఈ ట్రెండ్ ఫాలో కాగా.. తాజాగా నేపాల్‌కు చెందిన ఓ మహిళా క్రికెటర్ పుష్ప సెలబ్రేషన్ చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఎంతగా అంటే ఈ వీడియోపై ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలే (ఐసీసీ) రియాక్టయింది. ఈ నెల 5న నేపాల్‌లో టోర్నడోస్ వుమెన్, సఫైర్స్ వుమెన్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీతా రాణా మగర్ అనే ప్లేయర్ ఈ పుష్ప స్టైల్‌ను ఇమిటేట్ చేసింది.
వికెట్ తీసిన ఆనందంలో ఒకసారి, క్యాచ్ పట్టిన ఆనందంలో మరోసారి ఈ పుష్ప స్టైల్‌ను ఆమె ఇమిటేట్ చేయడం విశేషం. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "ఇది సోషల్ మీడియాలో చాలా దూరం వెళ్లిపోయింది.. ప్రస్తుతం పాపులర్ సెలబ్రేషన్‌ను ఫాలో అవుతున్న నేపాల్ క్రికెటర్ సీతా రాణా మగర్" అంటూ ఈ వీడియోకు ఐసీసీ కామెంట్ చేసింది.
ఫెయిర్‌బ్రేక్ ఇన్విటేషన్ టోర్నమెంట్‌లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్, పాకిస్థాన్, వెస్టిండీస్‌లకు చెందిన ప్రముఖ మహిళా క్రికెటర్లు కూడా పాల్గొంటున్నారు. అంతర్జాతీయంగా మహిళా క్రికెట్‌ను మరింత పాపులర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు.
టాపిక్