ICC Men's Test Team of the Year 2022: ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ 2022లో ఒకే ఒక్క ఇండియన్ ప్లేయర్.. ఎవరో తెలుసా?
ICC Men's Test Team of the Year 2022: ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2022లో ఒకే ఒక్క ఇండియన్ ప్లేయర్ కు మాత్రమే చోటు దక్కింది. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్సే ఈ టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు.
ICC Men's Test Team of the Year 2022: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022కుగాను వరుసగా ఒక్కో టీమ్ ఆఫ్ ద ఇయర్ ను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే టీ20, వన్డే టీమ్ లను ప్రకటించిన ఐసీసీ.. తాజాగా టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ను అనౌన్స్ చేసింది. అయితే ఒక్కో టీమ్ లో ఉన్న ఇండియన్ ప్లేయర్స్ సంఖ్య తగ్గుకుంటూ వస్తోంది.
టీ20 టీమ్ లో ముగ్గురు, వన్డే టీమ్ లో ఇద్దరు ఉండగా.. ఈ టెస్ట్ టీమ్ లో ఒక్క ఇండియన్ ప్లేయర్ మాత్రమే ఉన్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు మాత్రమే టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ లో చోటు దక్కింది. గతేడాది టెస్టుల్లో టాప్ ఫామ్ లో ఉన్న పంత్ 12 ఇన్నింగ్స్ లో 61 సగటుతో 680 రన్స్ చేశాడు. అందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక వికెట్ల వెనుక కూడా పంత్ బాగానే రాణించాడు. మొత్తం 2022లో అతడు 23 క్యాచ్ లు అందుకోగా, 6 స్టంపింగ్స్ చేశాడు. ఇక ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్సే ఈ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ కు కూడా కెప్టెన్ అయ్యాడు. తన దూకుడైన కెప్టెన్సీతో అతడు ఇంగ్లండ్ ను ముందుండి నడిపించాడు. స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 9 మ్యాచ్ లు గెలిచింది.
స్టోక్స్ బ్యాటింగ్ లోనూ రాణించాడు. అతడు రెండు సెంచరీలు సహా 870 రన్స్ చేశాడు. ఇక బౌలింగ్ లో 26 వికెట్లు తీసుకున్నాడు. ఇక టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ లో స్టోక్స్ తో పాటు ఇంగ్లండ్ కే చెందిన జానీ బెయిర్ స్టో, జేమ్స్ ఆండర్సన్ కు కూడా చోటు దక్కింది. ఇక ఆస్ట్రేలియా నుంచి ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, ప్యాట్ కమిన్స్, నేథన్ లయన్ లు ఈ టీమ్ లో ఉన్నారు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వెయిట్, సౌతాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడా కూడా ఈ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ లో చోటు దక్కించుకున్నారు. బాబర్ ఆజంకు వన్డే టీమ్ లోనూ చోటు దక్కిన విషయం తెలిసిందే.
ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2022 ఇదే
బెన్ స్టోక్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, ప్యాట్ కమిన్స్, నేథన్ లయన్, రిషబ్ పంత్, బాబర్ ఆజం, క్రెయిగ్ బ్రాత్‌వెయిట్, కగిసో రబాడా, జానీ బెయిర్ స్టో, జేమ్స్ ఆండర్సన్
సంబంధిత కథనం