Ipl prize money 2022 | ఐపీఎల్ 2022 విన్నర్, రన్నరప్ ప్రైజ్‌మ‌నీ ఎంతో తెలుసా....-how much prize money will get winner and runner up in ipl 2022 ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  How Much Prize Money Will Get Winner And Runner Up In Ipl 2022

Ipl prize money 2022 | ఐపీఎల్ 2022 విన్నర్, రన్నరప్ ప్రైజ్‌మ‌నీ ఎంతో తెలుసా....

సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా
సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా (twitter)

ఐపీఎల్ 2022లో విజేత ఎవ‌ర‌న్న‌ది నేడు తేల‌నుంది. అహ్మ‌దాబాద్‌లో జ‌రుగ‌నున్న ఫైన‌ల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌బోతున్న‌ది. ఆడిన తొలి సీజ‌న్‌లోనే గుజ‌రాత్ ఫైన‌ల్‌కు చేరింది. సుదీర్ఘ విరామం త‌ర్వాత రాజ‌స్థాన్ ఫైన‌ల్ బెర్తు ద‌క్కించుకున్న‌ది. ఈ ఇద్ద‌రిలో విజేత ఎవ‌ర‌న్న‌ది క్రికెట్ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ ఐపీఎల్‌లో విన్న‌ర్‌,ర‌న్న‌ర‌ప్ ల‌కు ఎంత ప్రైజ్‌మ‌నీ ద‌క్కుతుందో తెలుసా...

htఐపీఎల్ 2022లో తుది అంకానికి చేరుకున్న‌ది. నేడు జ‌రిగే ఫైన‌ల్ లో గుజ‌రాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి.  అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు ల‌క్ష ఇరవై ఐదు వేల మంది అభిమానులు హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ట్రెండింగ్ వార్తలు

ఈ టీ20 లీగ్ లో విజేతగా నిలిచే జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ అంద‌బోతున్న‌ది. విన్న‌ర్‌కు 20 కోట్ల ప్రైజ్ మ‌నీ ద‌క్క‌నున్న‌ది. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన జ‌ట్టు13 కోట్ల ప్రైజ్‌మ‌నీ అందుకోనున్న‌ది. అలాగే క్వాలిఫ‌యర్ లో మ్యాచ్‌లో రాజ‌స్థాన్ చేతిలో ఓట‌మి పాలైన బెంగ‌ళూరు జ‌ట్టు  7 కోట్ల ప్రైజ్ మ‌నీ సొంతం చేసుకోనున్న‌ది. అలాగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ప‌రాజ‌యం పాలైన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీమ్‌కు 6.5 కోట్లు ద‌క్క‌నున్నాయి. 

2008లో ఐపీఎల్ ప్రారంభ ఎడిష‌న్‌లో ప్రైజ్‌మ‌నీ 4.8 కోట్లుగా ఉంది. ఇప్ప‌డు అది నాలుగింత‌లు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. అలాగే ఆరెంజ్ క్యాప్ విన్న‌ర్, ప‌ర్‌పుల్ క్యాప్ విన్న‌ర్స్‌కు త‌లో ప‌దిహేను ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ ద‌క్క‌నున్న‌ట్లు చెబుతున్నారు. 

అరెంజ్ క్యాప్ రేసులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేయ‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ నిలిచాడు. ఈ సీజ‌న్‌లో నాలుగు సెంచ‌రీల‌తో 824 ప‌రుగులు చేశాడు బ‌ట్ల‌ర్‌. ప‌ర్‌పుల్ క్యాప్ రేసులో 26 వికెట్ల‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ తో పాటు బెంగ‌ళూరు ప్లేయ‌ర్ వ‌హిందు హ‌స‌రంగా స‌మానంగా ఉన్నారు. ఫైన‌ల్ మ్యాచ్‌లో చాహ‌ల్ ఒక్క వికెట్ తీసినా అత‌డికే ప‌ర్‌పుల్ క్యాప్ ద‌క్కుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్