Gavaskar on Gabba Pitch: గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు?ఐసీసీ వైఖరిని ఎండగట్టిన గవాస్కర్.. -how many demerit points did gabba pitch get gavaskar slams on icc ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  How Many Demerit Points Did Gabba Pitch Get Gavaskar Slams On Icc

Gavaskar on Gabba Pitch: గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు?ఐసీసీ వైఖరిని ఎండగట్టిన గవాస్కర్..

Maragani Govardhan HT Telugu
Mar 04, 2023 05:15 PM IST

Gavaskar on Gabba Pitch: టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఐసీసీ తీరుపై మండిపడ్డారు. ఇటీవలే ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు వేదికై ఇండోర్ పిచ్‌‌కు ఐసీసీ పేలవంగా ఉందని మూడు డీ పాయింట్లు ఇచ్చింది. దీంతో గబ్బా పిచ్‌కు ఎన్ని పాయింట్లు ఇచ్చారో చెప్పాలంటూ అసహనం వ్యక్తం చేశారు.

సునీల్ గవాస్కర్
సునీల్ గవాస్కర్ (twitter)

Gavaskar on Gabba Pitch: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. ఇండోర్ వేదికగా జరిగిన ఈ టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది చాలా పేలవమైన పిచ్ అని పలువురు మాజీలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఐసీసీ కూడా పేర్కొంది. మ్యాచ్ రిఫరీ నివేదిక ఆధారంగా ఈ పిచ్ పేలవంగా ఉన్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ మైదానానికి మూడు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది. తాజాగా ఈ అంశంపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. గబ్బా పిచ్‌కు ఎన్ని డీ మెరిట్ పాయింట్లు కేటాయించారు? అని ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు

"నాకు ఓ విషయం తెలుసుకోవాలని ఉంది. గత ఏడాది నవంబరులో బ్రిస్బేన్ గబ్బా(Gabba Pitch) వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. ఆ పిచ్‌కు ఎన్ని డీ మెరిట్ పాయింట్లు కేటాయించారు. అప్పుడు మ్యాచ్ రిఫరీ ఎవరు?" అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు బౌలర్లకు ఎక్కువగా సహకరించిన ఈ పిచ్‌కు సంబంధించి ఐసీసీ అప్పట్లో ఒక్క డీమెరిట్ పాయింట్‌తో యావరేజ్ కంటే తక్కువ అని రేటింగ్ ఇచ్చిందని ఐసీసీ వైఖరిని ఎండగట్టారు.

గబ్బా వేదికగా గత నవంబరులో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టులో కంగారూ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలర్లకు ఎక్కువగా సహకరించిన ఈ పిచ్‌కు సంబంధించి ఐసీసీ అప్పట్లో ఒక్క డీమెరిట్ పాయింట్ అంటే యావరేజ్ కంటే తక్కువ అని రేటింగ్ ఇచ్చింది.

ఇక ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడో రోజు ఉదయమే మ్యాచ్ ముగిసింది. మ్యాచ్‌లో పిచ్ స్పిన్‌కు విపరీతంగా అనుకూలించింది. తొలి రోజు ఆరంభం నుంచే పిచ్‌పై స్పిన్నర్లు విజృంభించారు. ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

WhatsApp channel

సంబంధిత కథనం