Hockey World Cup 2023 INDvs ENG: హాకీ వరల్డ్ కప్‌లో ఆదివారం ఇండియా - ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు ఎనిమిది, ఇండియాకు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు లభించినా వాటిని ఇరు జట్ల ప్లేయర్స్ గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. ,నిర్ణీత సమయం ముగిసే సరికి గోల్ చేయడానికి ఇండియా, ఇంగ్లాండ్ ప్లేయర్లు గట్టిగానే ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. ఆట ఫస్ట్ క్వార్టర్‌లోనే ఇంగ్లాండ్‌కు ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ భారత గోల్ కీపర్ శ్రీజీత్ వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గోల్ చేసేందుకు ఇండియన్ ప్లేయర్స్ హార్దిక్ సింగ్, మణ్‌దీప్‌సింగ్ చాలా ట్రై చేశారు. కానీ తృటిలో అవకాశాలు చేజారాయి. ,మ్యాచ్ డ్రాగా ముగియడంతో రెండు టీమ్‌లకు తలో పాయింట్ దక్కింది. ప్రస్తుతం గ్రూప్ డిలో ఇండియా, ఇంగ్లాండ్ నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. కానీ గోల్స్ తేడా కారణంగా ఇంగ్లాండ్ టాప్‌లో నిలవగా ఇండియా రెండో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై 5-0 తేడాతో ఇంగ్లాండ్ విజయాన్ని అందుకోగా స్పెయిన్‌పై 2-0 తేడాతో ఇండియా గెలిచింది. జనవరి 19న ఇంగ్లాండ్ -స్పెయిన్, ఇండియా - వేల్స్ మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి.