Hockey World Cup 2023 : క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఇండియా చేరాలంటే ఎలా?
Hockey World Cup 2023 : హాకీ ప్రపంచ కప్ 2023లో భారత హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోవాలంటే ఇంకా గెలవాల్సి ఉంది. ఆదివారం న్యూజిలాండ్‌తో క్రాస్ ఓవర్ మ్యాచ్ ఆడాలి.
భారత్‌లో జరుగుతున్న హాకీ ప్రపంచకప్ (Hockey World Cup 2023)లో భారత హాకీ జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోయింది. తమ పూల్‌లోని చివరి మ్యాచ్‌లో భారత జట్టు 4-2 గోల్స్ (భారత్ vs వేల్స్)తో వేల్స్ జట్టును ఓడించింది. కానీ క్వార్టర్ ఫైనల్స్‌లో నేరుగా చోటు దక్కించుకోలేకపోయింది. క్వార్టర్ లో చేరాలంటే.. ఇంకా గోల్స్ కావాల్సి ఉంది. అయితే చివరికి వేల్స్‌పై భారత జట్టు 2 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో పూల్ 'డి'లో భారత హాకీ జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్(England) తొలి స్థానంలో ఉంది. ఇప్పుడు భారత హాకీ జట్టు(Hockey Team India) క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోవాలంటే ఆదివారం న్యూజిలాండ్(New Zealand)తో క్రాస్‌ఓవర్ మ్యాచ్ ఆడాలి.
భారత్ మరియు వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆకాష్‌దీప్ సింగ్ 32వ మరియు 45వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించగా.. 21వ నిమిషంలో షంషేర్ సింగ్, 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ సాధించారు. కాగా వేల్స్ తరఫున గారెత్ ఫర్లాంగ్ 42వ నిమిషంలో, జాకబ్ డ్రేపర్ 44వ నిమిషంలో గోల్స్ చేశారు.
పూల్ 'డి' గురించి చూస్తే.. ఇంగ్లండ్ మరియు భారత్ టాప్ లో ఉన్నాయి. ఇరు జట్లు 2 మ్యాచ్‌లు గెలిచి 1 మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాయి. కానీ గోల్ తేడా ఆధారంగా ఇంగ్లండ్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ జట్టు 9 గోల్స్ చేయగా, భారత జట్టు 6 గోల్స్ మాత్రమే చేయగలిగింది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన కూడా... టీమిండియా నేరుగా ప్రపంచ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరదు. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే భారత్ 8-0తో వేల్స్‌ను ఓడించాల్సింది. కానీ ఛాన్స్ మిస్ అయింది.
ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు గురించి చెప్పాలంటే.. గ్రూప్ 'సి'లో 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ జట్టు ఆడిన 3 మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. స్పెయిన్‌ను 2-0తో ఓడించి టోర్నీలో శుభారంభం చేసిన భారత్ తన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడింది. కానీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిజానికి ఈ మ్యాచ్ ఫలితం భారత జట్టు కష్టాన్ని పెంచిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత వేల్స్‌పై కూడా భారత్ పెద్ద తేడాతో గెలవలేకపోయింది. అయితే ఎట్టకేలకు విజయం సాధించి భారత జట్టు ఆశలు సజీవంగా ఉంచుకుంది. చూడాలిక.. ఏం జరుగుతుందో..?
సంబంధిత కథనం