Hockey World Cup 2023 : వామ్మో.. హాకీ వరల్డ్ కప్ కోసం ఇంత ఖర్చు చేశారా?-hockey world cup 2023 check how much expenditure on odisha hockey mens world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Hockey World Cup 2023 Check How Much Expenditure On Odisha Hockey Mens World Cup

Hockey World Cup 2023 : వామ్మో.. హాకీ వరల్డ్ కప్ కోసం ఇంత ఖర్చు చేశారా?

Anand Sai HT Telugu
Jan 13, 2023 01:58 PM IST

Hockey World Cup 2023 : హాకీ వరల్డ్‌ కప్‌ మెుదలైన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారీ కూడా ఒడిశాలోనే ఈ మెగా టోర్నీ జరుగుతోంది. జనవరి 11న ఓపెనింగ్‌ సెర్మనీ సూపర్ గా జరిగింది. ఇంతకీ ఈ ప్రపంచ కప్ కోసం ఎంత ఖర్చు చేశారు?

హాకీ స్టేడియం
హాకీ స్టేడియం (twitter)

Hockey World Cup : మెన్స్‌ హాకీ వరల్డ్‌ కప్‌(Hockey World Cup) ప్రారంభమైంది. ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియంలో మెగా టోర్నీ ఓపెనింగ్ సెర్మనీ జరిగింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ తయ్యబ్‌ ఇక్రమ్‌, హాకీ ఇండియా ఛైర్మన్‌ దిలీప్‌ టిర్కీ పాల్గొన్నారు. అయితే ఈ ప్రపంచ కప్ ఈవెంట్ కోసం చాలా డబ్బును ఖర్చు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఈసారి ప్రపంచకప్‌ను నిర్వహించడానికి రూ.1098 కోట్లు ఖర్చు చేసినట్లు బడ్జెట్‌లో చూపారు. ఇది స్టేడియం నిర్మాణం, రవాణా, నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ఖర్చులను కవర్ చేస్తుంది. హాకీ ప్రపంచకప్‌కు భారత్‌ వరుసగా రెండోసారి ఆతిథ్యం ఇస్తోంది. అయితే, ఈ సంవత్సరం ప్రపంచ కప్ 2018 కంటే గొప్ప స్థాయిలో నిర్వహిస్తున్నారు.

స్టేడియం నిర్మాణం, రవాణా, నిర్వహణకు సంబంధించి.. ఇలా అనేక రకాలు ఖర్చులు చాలా అయ్యాయి. రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియం(birsa munda international hockey stadium) నిర్మాణానికి చాలా డబ్బు వెచ్చించారు. 20 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని నిర్మించేందుకు 875.78 కోట్ల రూపాయలు వెచ్చించారు.

ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో జరుగుతాయి. ప్రపంచకప్‌ కోసం రెండు స్టేడియాల్లో కొత్త టర్ఫ్‌ వేశారు. ఇందుకోసం 17.5 కోట్లు. ఖర్చుపెట్టారు. మెుత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్‌ కోసం వచ్చిన క్రీడాకారులు, కోచింగ్ సిబ్బంది, ఇతర అధికారులు నివసించేందుకు కొత్త భవనాలు సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.84 కోట్లు ఖర్చుపెట్టారు.

75 కోట్లను వేదిక నిర్వహణ, బృందాలు, అధికారులు, ఇతర వ్యక్తులు రావడం మరియు వెళ్లడం కోసం ఖర్చు పెడుతున్నారు. ప్రపంచ కప్ బ్రాండింగ్, ప్రమోషన్ ఖర్చుల వ్యయం కూడా ఉంది.

ఇక భారత్ ఆట విషయానికొస్తే.. వరుసగా రెండోసారి నిర్వహిస్తుండడంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీని దక్కించుకోవాలని లక్ష్యంతో ఉంది. 48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పోడియం ఫినిష్‌ చేయాలని హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ సేన అనుకుంటోంది. 1971లో జరిగిన మొదటి వరల్డ్‌ కప్‌లో కాంస్యం అందుకుంది ఇండియా(India). ఆ తర్వాత మెరుగైన ప్రదర్శనతో 1973 టోర్నీలో రజత పతకంతో సూపర్ అనిపించించింది.

అజిత్‌పాల్‌ సింగ్‌ నేతృత్వంలో 1975లో విశ్వవిజేతలుగా నిలిచింది భారత్. ఆ తర్వాత ఆటతీరు నిరాశనే మిగిల్చింది. ఎప్పుడూ మెగా టోర్నీలో కనీసం సెమీస్ కూడా చేరుకోలేదు. 1978 టూ 2014 వరకు గ్రూప్‌ దశ కూడా దాటలేదు. టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం.. ప్రదర్శన సూపర్ గా ఉంది. కాంస్య పతకంతో దూసుకెళ్లారు. ఇక ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని చూస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం