Sachin in HTLS 2022: బ్యాటింగ్ తీరుతెన్నులను మార్చిన సచిన్, లారా.. దిగ్గజాలతో ప్రత్యేక ముఖాముఖి-hindustan times leadership summit 2022 was the session featuring sachin tendulkar and brian lara ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Hindustan Times Leadership Summit 2022 Was The Session Featuring Sachin Tendulkar And Brian Lara

Sachin in HTLS 2022: బ్యాటింగ్ తీరుతెన్నులను మార్చిన సచిన్, లారా.. దిగ్గజాలతో ప్రత్యేక ముఖాముఖి

Maragani Govardhan HT Telugu
Nov 12, 2022 06:14 PM IST

Sachin in HTLS 2022: సచిన్ తెందూల్కర్, బ్రియన్ లారా నిన్నటి తరానికి చెందిన ఈ క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అభిమానులు వీరిద్దరినీ క్రికెట్ దేవుళ్లుగా చూస్తారు. ఆట పరంగా ఇద్దరిలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి స్నేహితులు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌కు హాజరైన వీరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న సచిన్, లారా
హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న సచిన్, లారా

హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ 2022లో క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, బ్రియన్ లారా పాల్గొన్నారు. హిందుస్థాన్ టైమ్స్ మేనేజ్మెంట్ మేనేజింగ్ ఎడిటర్ కునాల్ ప్రధాన్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఇద్దరూ క్రీడాకారులు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వీరిద్దరు తమ స్నేహాన్ని, మైదానంలో వారి పోటీ తత్వాన్ని గురించి వివరించారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఎవరు గెలుస్తారనేదానిపై కూడా ఇద్దరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

సచిన్, లారా ఇద్దరూ తమ గురంచి అభిమానులకు కొన్ని వాస్తవాలను తెలియపరిచారు. మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు, తమ ట్రేడ్ మార్క్, నిరాశలో కూరుకున్నప్పుడు ఎలా ఉన్నారు లాంటి విషయాలను వెల్లడించారు. ఎగ్జిబీషన్ మ్యాచ్‌లో సచిన్, లారా కలిసి బ్యాటింగ్ చేయడం గురించి కునాల్ అడిగారు. ఆ వీడియో కోసం అభిమానులు యూట్యూబ్‌లో విపరీతంగా సెర్చ్ చేశారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లతో లాంటి స్టార్లు ఉన్న పాకిస్థాన్ లైనప్‌ను ఎలా కూల్చివేశారో సచిన్, లారా వివరంగా తెలియజేశారు.

సిడ్నీలో సచిన్ ఐకానిక్ డబుల్ సెంచరీ చేసినప్పుడు తన ఆనందాన్ని ఎలా నియంత్రించుకున్నాడో లారా గుర్తు చేసుకున్నాడు. ప్రతి అభిమానివ వలే ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు. అలాగే లారా పరుగుల దాహం, నిలకడం, నైపుణ్యం గురించి సచిన్ ప్రశంసించాడు. కరెబియన్ దిగ్గజం కిట్ బ్యాగ్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు.

టీ20 రాకతో క్రికెట్ చాలా మారిపోయిందని ఇద్దరు మాజీలు తెలియజేశారు. మోడర్న్ బ్యాటర్లు తమ వినూత్న 360 డిగ్రీల షాట్లతో బ్యాటింగ్‌లో విప్లవాత్మక మార్పులు చేశారని, కొంతమంది వారిని ఎగతాళీ చేసినప్పటికీ.. వారి వైవిధ్యమైన ఆటతీరు గేమ్‌ను మంచిగా మార్చివేసిందని లారా స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం చాలాకష్టమని, కొంతమంది టెస్టుల్లో కష్టపడుతుంటే, కొంది టీ20 ఫార్మాట్‌ సవాలు ఎదుర్కొంటున్నారని తెలిపాడు.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎవరు గెలుస్తారు?

పాకిస్థాన్‌కు మెరుగైన జట్టు ఉందని లారా అభిప్రాయపడ్డాడు. మరోవైపు సచిన్ ఎంసీజీ మైదానం ఇంగ్లాండ్‌కు కలిసొస్తుందని, అందుకని బట్లర్ జట్టు గెలిచే అవకాశముందని స్పష్టం చేశాడు. మొత్తంమీద సచిన్, లారా ఇద్దరూ మరోసారి తమ అభిమానులతో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

WhatsApp channel

సంబంధిత కథనం