FIFA 2022 Today Schedule: ఫ్రాన్స్‌తో ట్యూనిషియా ఢీ? ఆస్ట్రేలియాతో తలపడనున్న డెన్మార్క్?-here matches schedule of fifa world cup 2022 day 11 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Here Matches Schedule Of Fifa World Cup 2022 Day 11

FIFA 2022 Today Schedule: ఫ్రాన్స్‌తో ట్యూనిషియా ఢీ? ఆస్ట్రేలియాతో తలపడనున్న డెన్మార్క్?

Maragani Govardhan HT Telugu
Nov 30, 2022 08:09 AM IST

FIFA 2022 Today Schedule: ఈ రోజు మ్యాచ్‌లు ఆసక్తికరంగా ఉండనున్నాయి. గ్రూప్-డీ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ మినహా మిగిలిన మూడు జట్ల మధ్య నాకౌట్ దశ కోసం తీవ్ర పోటీ నెలకొననుంది. ఫ్రాన్స్ ఇప్పటికే రెండు విజయాలతో నాకౌట్‌కు చేరుకుంది.

ఫ్రాన్స్‌తో మ్యాచ్  కోసం సాధన చేస్తున్న ట్యూనిషియా జట్టు
ఫ్రాన్స్‌తో మ్యాచ్ కోసం సాధన చేస్తున్న ట్యూనిషియా జట్టు (AFP)

FIFA 2022 Today Schedule: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022లో బుధవారం నాడు గ్రూప్-డీలో రవత్తరమైన మ్యాచ్‌లు జరిగే అవకాశముంది. ఇప్పటికే ఈ గ్రూపులో ఫ్రాన్స్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి నాకౌట్ దశకు చేరుకోగా.. మిగిలిన మూడు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గ్రూప్-డీలో ఉన్న నాలుగు జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లు ఫలితం ఆసక్తికరంగా మారనుంది. మిగిలిన మూడు జట్లకు నాకౌట్ దశకు చేరుకునేందుకు సమాన అవకాశముంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ రోజు మ్యాచ్‌ల షెడ్యూల్..

- అల్ రయాన్ వేదికగా ఫ్రాన్స్-ట్యూనిషయా మధ్య రాత్రి 8.30 గంటలకు జరగనుంది.

- రెండో మ్యాచ్ అల్ జనోబ్ వేదికగా ఆస్ట్రేలియా-డెన్మార్క్ మధ్య రాత్రి 8.30 గంటలకు నిర్వహించనున్నారు.

తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను ట్యూనిషియా ఢీ కొట్టనుంది. మరోవైపు ఆస్ట్రేలియాతో డెన్మార్క్ తలపడనుంది. ఫ్రాన్స్‌పై ట్యూనిషియా గెలిస్తే.. ఆ జట్టు తుది ఫలితం ఆస్ట్రేలియా-డెన్మార్క్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు జట్లలో ఏది గెలిచినా.. భారీ తేడాతో గెలవకూడదు. ఒకవేళ గెలిస్తే ట్యూనిషియాపై వేటు పడుతుంది.

మరోవైపు ఆస్ట్రేలియా-డెన్నార్క్ మధ్య మ్యాచ్‌లో గెలిచే జట్టు కూడా ఫ్రాన్స్‌పై ట్యూనిషియా ఓడిపోవాలని కోరుకోవాలి. ఎందుకంటే ఫ్రాన్స్ మినహా మిగిలిన మూడు జట్లు ఒక్కో విజయంతో పాయింట్ల పట్టికలో వరుస స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగే అవకాశముంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఫ్రాన్స్‌ను ట్యూనిషియా ఓడించడం అంత సులువేం కాదు. కాబట్టి ట్యూనిషియాకు పరిస్థితులు క్లిష్టంగా మారే అవకాశముంది.

మరోవైపు ఆస్ట్రేలియా-డెన్మార్క్ జట్లు బలబలాల పరంగా సమంగా ఉన్నప్పటికీ డెన్మార్కే బలంగా ఉన్నప్పటికీ ఆసీస్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రూప్-సీ మ్యాచ్‌లు జరగనున్నాయి. అర్ధరాత్రి 12.30 గంటలకు పోలాండ్.. అర్జెంటీనాను ఢీకొట్టనుండగా.. సౌదీ అరేబియాతో మెక్సికో తలపడనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం