Hayden Natu Natu Dance: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హేడెన్.. వీడియో వైరల్
Hayden Natu Natu Dance: నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హేడెన్. ఈ పాట ఆస్కార్స్ గెలిచిన తర్వాత హేడెన్ చేసిన ఈ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
Hayden Natu Natu Dance: నాటు నాటు పాట ప్రపంచాన్నే ఊపేస్తోంది. ఆ సాంగ్ లోని బీట్స్.. తారక్, చరణ్ వేసిన స్టెప్పులు ఎంతోమంది ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్స్ కూడా గెలిచింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సాంగ్ గా రికార్డు క్రియేట్ చేసింది. అయితే సోమవారం (మార్చి 13) ఈ మూవీ ఆస్కార్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ఈ పాటకు స్టెప్పులేయడం విశేషం.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో టెస్టులో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న హేడెన్.. బ్రేక్ టైమ్ లో ఇలా డ్యాన్స్ చేశాడు. అతనితోపాటు టీమిండియా మాజీ క్రికెటర్లు దీప్‌దాస్ గుప్తా, మురళీ కార్తీక్ కూడా స్టెప్పులేయడం విశేషం. ఇఫ్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు వీళ్లు చేసిన డ్యాన్స్ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేసింది.
ఆ వెంటనే సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. ఈ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ లో ఆదివారం (మార్చి 12) రాత్రి జరిగినా.. భారత కాలమానం ప్రకారం సోమవారం (13) ఉదయం లైవ్ టెలికాస్ట్ జరిగింది. ఉదయం 8.15 గంటల ప్రాంతంలో బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు ఆస్కార్స్ గెలిచిందని అనౌన్స్ చేయగానే భారతీయ సినీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు అవార్డులు వచ్చినప్పుడే ఇక అకాడెమీ అవార్డు కూడా ఖాయమన్న అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లే నాటు నాటు ఆస్కార్స్ అందుకుంది. ఈ పాటకు మ్యూజిక్ అందించిన కీరవాణి, పాట రాసిన చంద్రబోస్ లకు ఆస్కార్స్ అందించారు.
సంబంధిత కథనం