Harmanpreet Kaur Match Fees: హర్మన్ ప్రీత్ మ్యాచ్ ఫీజులో కోత - కెప్టెన్‌పై నిషేధం త‌ప్ప‌దా?-harmanpreet kaur fined 75 percent match fee and 3 demerit points for her behaviour in 3rd odi against bangladesh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Harmanpreet Kaur Match Fees: హర్మన్ ప్రీత్ మ్యాచ్ ఫీజులో కోత - కెప్టెన్‌పై నిషేధం త‌ప్ప‌దా?

Harmanpreet Kaur Match Fees: హర్మన్ ప్రీత్ మ్యాచ్ ఫీజులో కోత - కెప్టెన్‌పై నిషేధం త‌ప్ప‌దా?

HT Telugu Desk HT Telugu

Harmanpreet Kaur Match Fees:టీమ్ ఇండియా కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్‌ మ్యాచ్ ఫీజులో కోత ప‌డింది. ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్స్ వ‌చ్చాయి. ఇందుకు కార‌ణం ఏమిటంటే.

హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్

Harmanpreet Kaur Match Fees: బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో అంపైర్స్‌ నిర్ణ‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన టీమ్ ఇండియా ఉమెన్స్ జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ ఫీజులో కోత ప‌డింది. అంతే కాకుండా ఆమెపై నిషేదం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ మూడే వ‌న్డేలో భార‌త్ సుల‌భంగా గెలిచేలా క‌నిపించింది. విజ‌యానికి చేరువ అవుతోన్న స‌మ‌యంలో చివ‌రి ఆరు వికెట్ల‌ను వెంట వెంట‌నే కోల్పోవ‌డంతో వ‌న్డే మ్యాచ్ టైగా ముగిసింది.

ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్ ఔట్ విష‌యంలో అంపైర్స్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ ఔట్ విష‌యంలో బంగ్లా ప్లేయ‌ర్స్ అప్పీల్ చేయ‌డానికంటే ముందే అంపైర్ ఆమెను ఔట్‌గా ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అంపైర్ నిర్ణ‌యంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన హ‌ర్మ‌న్ ప్రీత్ త‌న బ్యాట్‌తో స్టంప్స్‌ను బ‌లంగా కొట్టింది. ట్రోఫీ ప్ర‌జెంటేష‌న్ టైమ్‌లో బంగ్లాదేశ్ ఆట‌గాళ్ల‌తో ఫొటో దిగుతోండ‌గా మీతో పాటు అంపైర్స్‌ను కూడా తెచ్చుకుంటే బాగుండేదంటూ హ‌ర్మ‌న్ ప్రీత్ అనుచిత వ్యాఖ్య‌లు చేసింది.

అంపైర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టిన హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత ప‌డిన‌ట్లు స‌మాచారం.ఫైన్‌తో పాటు ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్స్ విధించిన‌ట్లు తెలిసింది. మ‌రో డీమెరిట్ పాయింట్ వ‌స్తే హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌పై ఓ టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వ‌న్డేలు, టీ20 మ్యాచ్‌లు నిషేధం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. రానున్న ఇర‌వై నాలుగు నెల‌ల్లో ఒక డీమెరిట్ పాయింట్ వ‌చ్చిన ఆమెపై ఈ నిషేధం ప‌డ‌నుంది.

కాగా మూడో వ‌న్డే టైగా ముగియ‌డంతో మూడు వ‌న్డేల సిరీస్ 1-1తో స‌మంగా ముగిసింది. దాంతో ట్రోఫీని ఇండియా, బంగ్లాదేశ్ జ‌ట్టు స‌మంగా పంచుకున్నాయి. హ‌ర్మ‌న్ ప్రీత్ ప్ర‌వ‌ర్త‌న‌తో పాటు ఆమె కామెంట్స్‌ను స్మృతి మంథ‌న‌తో పాటు మిగిలిన టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్ స‌మ‌ర్థిస్తున్నారు.

టాపిక్