Haris Rauf on Virat Kohli: కోహ్లిని ఔట్ చేయ‌డ‌మే నా టార్గెట్ - పాక్ పేస‌ర్ కామెంట్స్‌-haris rauf reveals to take wickets of virat kohli and babar azam his target ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Haris Rauf Reveals To Take Wickets Of Virat Kohli And Babar Azam His Target

Haris Rauf on Virat Kohli: కోహ్లిని ఔట్ చేయ‌డ‌మే నా టార్గెట్ - పాక్ పేస‌ర్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 27, 2023 01:17 PM IST

Haris Rauf on Virat Kohli: కోహ్లి వికెట్ తీయ‌డ‌మే త‌న టార్గెట్ అని అన్నాడు పాకిస్థాన్ పేస‌ర్ హ‌రీస్ ర‌వూఫ్‌. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో బాబ‌ర్ ఆజాంతో అత‌డు మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

హ‌రీస్ ర‌వూఫ్‌
హ‌రీస్ ర‌వూఫ్‌

Haris Rauf on Virat Kohli: స‌మ‌కాలీన క్రికెట్‌లో స్టార్ ప్లేయ‌ర్స్‌లో ఒక‌డిగా కొన‌సాగుతోన్నాడు టీమ్ ఇండియా క్రికెట‌ర్‌ విరాట్ కోహ్లి. మూడు ఫార్మెట్స్‌లో అద్భుత‌మైన రికార్డ్స్‌తో దూసుకుపోతున్న కోహ్లి వికెట్ తీయాల‌ని ప్ర‌తి బౌల‌ర్ కోరుకుంటాడు. పాకిస్థాన్ పేస‌ర్ హ‌రీస్ ర‌వూఫ్ టార్గెట్ కూడా అదేన‌ట‌.

ట్రెండింగ్ వార్తలు

ప్ర‌స్తుతం పాకిస్థాన్ క్రికెట్ లీగ్ ఎనిమిదో ఎడిష‌న్‌లో లాహోర్ ఖలంద‌ర్స్ త‌ర‌ఫున ఆడుతున్నాడు హ‌రీస్ ర‌వూఫ్‌. పెషావ‌ర్ జాల్మీ , లాహోర్ ఖ‌లంద‌ర్స్ మ్యాచ్ సంద‌ర్భంగా పెషావ‌ర్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాంను హ‌రీస్ ర‌వూఫ్ క‌లిశాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య సాగిన సంభాష‌ణ‌ల తాలూకు వీడియోను ఖ‌లంద‌ర్స్ టీమ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

బాబ‌ర్ ఆజాంతో పాటు విరాట్ కోహ్లి వికెట్ తీయ‌డ‌మే త‌న టార్గెట్ అంటూ ఈ వీడియోలో ర‌వూఫ్...బాబ‌ర్‌తో చెబుతూ క‌నిపించాడు. నీతో (బాబ‌ర్‌)తో పాటు విరాట్ వికెట్ తీయ‌లేక‌పోయారు. మీ ఇద్ద‌రు మాత్ర‌మే మిగిలిపోయారు. విలియ‌మ్స‌న్‌ను ఔట్ చేయాల‌ని అనుకున్నాను. కానీ రెండు సార్లు బ‌తికిపోయాడు. మీతో పాటు మ‌రో ముగ్గురు, న‌లుగురు క్రికెట‌ర్లు నా మైండ్‌లో ఉన్నారు అంటూ ఈ వీడియోలో బాబ‌ర్ ఆజాంతో హ‌రీస్ ర‌వూఫ్ చెబుతూ క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

WhatsApp channel