Ashwin On Harbhajan : హర్భజన్ సింగ్ నా హీరో.. అతన్నే కాపీ కొట్టా.. అశ్విన్ ఓపెన్ టాక్
IND Vs WI Ashwin Records : వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో స్పిన్నర్ అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు. అయితే తనకు స్ఫూర్తి హర్భజన్ సింగ్ అని చెప్పుకొచ్చాడు అశ్విన్.
ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)కు చోటు దక్కలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై అశ్విన్ కూడా స్పందించాడు. తాజాగా అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చానని మరోసారి నిరూపించుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకు 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 71 పరుగులకు 7 వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ మొత్తం 12 వికెట్లతో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.
ట్రెండింగ్ వార్తలు
భారత్ తరఫున ఒక టెస్టులో 10 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అనిల్ కుంబ్లే(Anil Kumble) 8 వికెట్ల రికార్డును సమం చేశాడు. అశ్విన్ ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 6వ సారి 5 వికెట్లు సాధించాడు. అంతే కాకుండా వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ 3వ స్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో హర్భజన్ సింగ్(Harbhajan Singh) 707 వికెట్ల రికార్డును రవిచంద్రన్ అశ్విన్ బద్దలు కొట్టాడు. దీంతో అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాడిగా అశ్విన్ ఘనత సాధించాడు. ఈ ఘనత గురించి అశ్విన్ మాట్లాడుతూ, భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఎప్పుడూ నా హీరో అని అన్నాడు. ఆస్ట్రేలియా జట్టుపై హర్భజన్ సింగ్ ఒంటరి విజయం సాధించాడని గుర్తుచేసుకున్నాడు.
2001లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ జ్ఞాపకాలు నేటికీ తాజాగా ఉన్నాయని అశ్విన్ చెప్పాడు. నా చిన్నప్పటి నుంచి అతని బౌలింగ్ యాక్షన్‌ని చాలాసార్లు కాపీ కొట్టేందుకు ప్రయత్నించానని వెల్లడించాడు. అలాంటి దిగ్గజ ఆటగాడిలో నా పేరు కూడా ఉండడం గౌరవంగా భావిస్తున్నానని అశ్విన్ అన్నాడు. ఈ రికార్డును నెలకొల్పిన అశ్విన్‌కు పలువురు మాజీ ఆటగాళ్లు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
తాజాగా అశ్విన్ ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టాడు. వెస్టిండీస్‌లో ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా ఆర్ అశ్విన్(R Ashwin) నిలిచాడు. 23వ సారి టెస్టు మ్యాచ్‌లో చివరి వికెట్ తీసి ప్రపంచ రికార్డులో షేన్ వార్న్ రికార్డును బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌పై 6 సార్లు అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన అశ్విన్.. ఈ విషయంలో హర్భజన్ సింగ్‌ను అధిగమించాడు. 12 వికెట్లతో, అశ్విన్ 8వ సారి టెస్ట్ మ్యాచ్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసి అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. చివరి టెస్టులోనూ అశ్విన్ 10 వికెట్లు పడగొట్టినట్లయితే.. ఈ ఘనత సాధించిన భారత నంబర్ 1 బౌలర్‌గా అవతరిస్తాడు.