Gambhir About Prithvi Shaw: పృథ్వీషాను టీ20ల్లో తీసుకోవడంపై గంభీర్ ఫైర్.. కోచ్, సెలక్టర్లు ఎందుకున్నారంటూ ప్రశ్న-gautam gambhir slams coach and selectors for not selecting prithvi shaw in t20is ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gautam Gambhir Slams Coach And Selectors For Not Selecting Prithvi Shaw In T20is

Gambhir About Prithvi Shaw: పృథ్వీషాను టీ20ల్లో తీసుకోవడంపై గంభీర్ ఫైర్.. కోచ్, సెలక్టర్లు ఎందుకున్నారంటూ ప్రశ్న

Maragani Govardhan HT Telugu
Jan 01, 2023 03:43 PM IST

Gambhir About Prithvi Shaw: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. భారత సెలక్టర్లు, కోచ్‌పై విమర్శలు గుప్పించాడు. పృథ్వీషాను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

గంభీర్-ద్రవిడ్
గంభీర్-ద్రవిడ్

Gambhir About Prithvi Shaw: టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా జాతీయ జట్టులో ఆడి చాలా కాలమే అయింది. చివరగా జులై 2021లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అతడిని అప్పటి నుంచి జట్టులోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం భీకర ఫామ్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్న పృథ్వీషాను మాత్రం సెలక్టర్లు ఎంపిక చేయడం లేదు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలోనూ అతడు అద్భుతంగా ఆడాడు. ఆ టోర్నీలో 181.42 స్ట్రైక్ రేటుతో 336 పరుగులు చేశాడు. ఆ టోర్నీ అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినప్ప్పటికీ అతడిని శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ప్రతిభ గల ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకుండా.. సెలక్టర్లు, కోచ్‌లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించాడు.

ట్రెండింగ్ వార్తలు

"అసలు కోచ్‌లు ఎందుకున్నారు? సెలక్టర్లు ఏం చేస్తున్నారు? కేవలం జట్టును ఎంపిక చేయడమే వారి పనా? లేక ఆటగాళ్లను పోల్చుతూ మ్యాచ్‌కు సిద్ధం చేయడమా? కోచ్‌లు, సెలక్టర్లు ఎవ్వరైనా జట్టులోకి పృథ్వీషా లాంటి ప్రతిభావంతులైన ఆఠగాళ్లను కనిపెట్టి వారికి అండగా నిలవాలి. అతడిని సరైన దారిలో పెట్టాలి. జట్టు మేనేజ్మెంట్ చేయాల్సిన విధుల్లో ఇది కూడా ఒకటి" అని గంభీర్ సీరియస్ అయ్యాడు.

అండర్-19 స్థాయిలో పృథ్వీషాకు పదును పెట్టిన ప్రస్తుతం టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడితో మాట్లాడాలని, ప్రోత్సహించాలని గంభీర్ అన్నాడు.

"పృథ్వీషాను ఎంపిక చేయడానికి ఫిట్నెస్, లైఫ్ స్టైల్ సమస్యలే కారణమైతే రాహుల్ ద్రవిడ్ లేదా సెలక్టర్ల ఛైర్మన్ అతడితో మాట్లాడాలి. ఈ అంశంపై అతడికి స్పష్టత ఇవ్వాలి. అతడి చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా చూడాలి. అప్పుడే మెరుగ్గా పర్యవేక్షివచ్చు. పృథ్వీషా తన కెరీర్ ఆరంభంలో ఎలా ఆడాడో చూశారా? ప్రతిభవంతుడైన అతడి ఎదుగుదలను అందరూ చూడాలి. అతడు ఎదుర్కొన్న సవాళ్లు కూడా ఉన్నాయి. టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లు అతడికి సరైన మార్గనిర్దేశం ఇవ్వడం ద్వారా సహాయపడవచ్చు." అని గంభీర్ స్పష్టం చేశాడు.

జనవరి 3 నుంచి లంక జట్టుతో టీమిండియా టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. అనంతరం జరగనున్న వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. టీ20ల్లో హిట్ మ్యాన్‌కు విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఈ పొట్టి సిరీస్‌కు బ్రేక్ తీసుకోవడంతో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది భారత్.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్