Ganguly on Yashasvi: వరల్డ్ కప్ టీమ్‌లో యశస్వి కచ్చితంగా ఉండాల్సిందే: గంగూలీ-ganguly on yashasvi says he must be there in world cup team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ganguly On Yashasvi: వరల్డ్ కప్ టీమ్‌లో యశస్వి కచ్చితంగా ఉండాల్సిందే: గంగూలీ

Ganguly on Yashasvi: వరల్డ్ కప్ టీమ్‌లో యశస్వి కచ్చితంగా ఉండాల్సిందే: గంగూలీ

Hari Prasad S HT Telugu
Jul 19, 2023 07:46 AM IST

Ganguly on Yashasvi: వరల్డ్ కప్ టీమ్‌లో యశస్వి కచ్చితంగా ఉండాల్సిందేనని అన్నాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన యశస్విపై అతడు ప్రశంసల వర్షం కురిపించాడు.

యశస్వి జైస్వాల్
యశస్వి జైస్వాల్ (BCCI Twitter)

Ganguly on Yashasvi: టీమిండియాకు దొరికిన కొత్త ఓపెనింగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్. తొలి టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు. తనలాగే కెరీర్లో తొలి టెస్టులోనే సెంచరీ చేసిన ఈ యశస్విపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపిస్తున్నాడు. అతడు కచ్చితంగా వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే అని అతడు అనడం విశేషం.

yearly horoscope entry point

టెలిగ్రాఫ్ తో మాట్లాడిన గంగూలీ.. ఈ యువ ప్లేయర్ ను ఆకాశానికెత్తాడు. విదేశీ గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్ గా 27 ఏళ్ల కిందటి రికార్డును కూడా యశస్వి బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అతడు 171 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా దాదా మాట్లడుతూ.. "తొలి టెస్టులోనే

సెంచరీ అనేది ఎప్పుడైనా చాలా పెద్ద విషయమే. నేను కూడా చేశాను. అందుకే అది ఎంత స్పెషలో నాకు తెలుసు. టెక్నిక్ విషయంలోనూ అతడు చాలా బాగా కనిపిస్తున్నాడు. జట్టులో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఉండటం ఎప్పుడూ మంచిదే. అందుకే అతడు వరల్డ్ కప్ జట్టులో కచ్చితంగా ఉండాల్సిందే" అని గంగూలీ స్పష్టం చేశాడు.

వరల్డ్ కోసం టీమిండియా సెలక్టర్లు ఇప్పటి నుంచే జట్టు ఎంపిక కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిపై కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ లతో మాట్లాడటానికి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెస్టిండీస్ వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో గంగూలీ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా టీమ్ లో ఓపెనింగ్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది సెలక్టర్లకు సవాలే.

రోహిత్, శుభ్‌మన్ గిల్ సెట్ అయ్యారు. ఇషాన్ రూపంలో మూడో ఓపెనర్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు యశస్వి కూడా పోటీలోకి వచ్చాడు. ఐపీఎల్ 2023లో అద్భుతంగా రాణించిన యశస్వి.. ఇప్పుడు టీమిండియాలోకి వచ్చి తొలి టెస్టులోనే సత్తా చాటాడు. లెఫ్ట్ హ్యాండర్ కావడం కూడా అతనికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ కప్ జట్టులో ఓ మంచి లెఫ్ట్ హ్యాండర్ కోసం సెలక్టర్లు చూస్తున్నారు.

అయితే అతన్ని వెస్టిండీస్ తో వన్డే జట్టుకు మాత్రం ఎంపిక చేయలేదు. ఆ తర్వాత జరిగే ఏషియన్ గేమ్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ కప్ టీమ్ రేసులో లేని యంగ్ ప్లేయర్స్ కు ఇందులో చోటు కల్పించారు.

Whats_app_banner

సంబంధిత కథనం