Gustav McKeon: టీ20ల్లో వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేసిన ఫ్రాన్స్‌ టీనేజర్‌-french teenager gustav mckeone creates world record in t20i ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  French Teenager Gustav Mckeone Creates World Record In T20i

Gustav McKeon: టీ20ల్లో వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేసిన ఫ్రాన్స్‌ టీనేజర్‌

Hari Prasad S HT Telugu
Jul 26, 2022 02:26 PM IST

Gustav McKeon: టీ20 క్రికెట్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఓ టీనేజర్‌ వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేశాడు. దీంతో మూడేళ్ల కిందట ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్‌ హజ్రతుల్లా క్రియేట్‌ చేసిన రికార్డు మరుగున పడిపోయింది.

టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గుస్తావ్ మెక్ కియోన్
టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గుస్తావ్ మెక్ కియోన్ (twitter)

వాంటా: క్రికెట్‌లో పెద్దగా పేరు లేని ఫ్రాన్స్‌లాంటి దేశానికి చెందిన ఓ యంగ్‌ క్రికెటర్‌ ఇప్పుడు టీ20ల్లో వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేయడం విశేషం. టీ20 వరల్డ్‌కప్‌ 2024 యూరప్‌ సబ్‌-రీజినల్‌ క్వాలిఫయర్‌ టోర్నమెంట్‌లో భాగంగా స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ అయింది. ఫ్రాన్స్‌కు చెందిన ఓపెనర్‌ గుస్తావ్‌ మెక్‌కియోన్‌ టీ20ల్లో సెంచరీ బాదిన యంగెస్ట్‌ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

ట్రెండింగ్ వార్తలు

మెక్‌కియోన్‌ వయసు 18 ఏళ్ల 280 రోజులు. ఇప్పటి వరకూ ఈ రికార్డు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్‌ పేరిట ఉండేది. అతడు 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఏళ్ల 337 రోజుల వయసులో సెంచరీ బాదాడు. ఇప్పుడా రికార్డును గుస్తావ్‌ బ్రేక్‌ చేశాడు. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో గుస్తావ్‌ కేవలం 61 బాల్స్‌లో 9 సిక్స్‌లు, 5 ఫోర్లతో 109 రన్స్‌ చేశాడు.

ఈ టోర్నీలో మెక్‌కియోన్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. 185 రన్స్‌తో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌ అతడే. ఇంతకు ముందు చెక్‌ రిపబ్లిక్‌ టీమ్‌పై కూడా మెక్‌కియోన్‌ 54 బాల్స్‌లో 76 రన్స్‌ చేశాడు. అయితే స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో మెక్‌ కియోన్‌ సెంచరీ చేసినా.. ఫ్రాన్స్‌ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో 158 రన్స్‌ టార్గెట్‌ను స్విట్జర్లాండ్‌ చివరి బంతికి చేజ్‌ చేసింది.

టీ20ల్లో సెంచరీలు చేసిన యంగెస్ట్‌ ప్లేయర్స్‌

గుస్తావ్‌ మెక్‌కియోన్‌ - 18 ఏళ్ల 280 రోజులు, ఫ్రాన్స్‌ vs స్విట్జర్లాండ్‌

హజ్రతుల్లా జజాయ్‌ - 20 ఏళ్ల 337 రోజులు, ఆఫ్ఘనిస్థాన్‌ vs ఐర్లాండ్‌

శివకుమార్‌ పెరియాల్వార్‌ - 21 ఏళ్ల 161 రోజులు, రొమేనియా vs టర్కీ

ఆర్చిడ్‌ తుయిసెంగె - 21 ఏళ్ల 190 రోజులు, రువాండా vs సీషెల్స్‌

దీపేంద్ర సింగ్‌ ఐరీ - 22 ఏళ్ల 68 రోజులు, మలేసియా vs కాట్మాండు

WhatsApp channel