ఫ్రెంచ్ ఓపెన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కు షాకింగ్ ఓటమి.. పరాజయం తట్టుకోలేక ఛైర్ అంపైర్ తో గొడవ-french open 2025 defending champion iga swiatek loss to sabalenka in semifinal fires on chair umpire ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  ఫ్రెంచ్ ఓపెన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కు షాకింగ్ ఓటమి.. పరాజయం తట్టుకోలేక ఛైర్ అంపైర్ తో గొడవ

ఫ్రెంచ్ ఓపెన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కు షాకింగ్ ఓటమి.. పరాజయం తట్టుకోలేక ఛైర్ అంపైర్ తో గొడవ

ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌లో అరీనా సబాలెంకా చేతిలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ కు షాకింగ్ ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్ లో పరాజయం పాలైన తర్వాత ఛైర్ అంపైర్ పై స్వియాటెక్ తీవ్ర విమర్శలు గుప్పించింది.

స్వియాటెక్ (AP)

ఫ్రెంచ్ ఓపెన్ 2025లో సంచలనం. డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ కు షాక్. సెమీఫైనల్ మ్యాచ్ లో అరీనా సబాలెంకా చేతిలో స్వియాటెక్ ఓడిపోయింది. ఫిలిప్ప్-చాట్రియర్ కోర్టులో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ స్వియాటెక్ 6-7 6-4 0-6తో ఓడిపోయింది. సబాలెంకా అద్భుతమైన టెన్నిస్ ఆడి విజేతగా నిలిచింది.

అంపైర్ తో వాగ్వాదం

ఫ్రెంచ్ ఓపెన్ స్వియాటెక్, సబాలెంకా మ్యాచ్ లో అంపైర్ వివాదం కూడా హాట్ టాపిక్ గా మారింది. అంపైర్ తీరుపై స్వియాటెక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వియాటెక్ మార్క్‌ను పరిశీలించమని అంపైర్‌ను కోరినప్పుడు అతను నిరాకరించాడు. ఒక సెట్ ఓడిపోయి రెండో సెట్‌లో 4-2తో ఆధిక్యంలో ఉన్నప్పుడు, సబాలెంకా సర్వ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. సబాలెంకా ఫస్ట్ సర్వ్ బయట పడినప్పుడు, స్వియాటెక్ ఆ మార్క్‌ను చూపిస్తూ అంపైర్ దగ్గరకు వెళ్లి పరిశీలించమని కోరింది.

చైర్ మీద నుంచి దిగను

స్వియాటెక్ బాల్ ఔటా? కాదా? చూడమని అప్పీల్ చేసింది. కానీ చైర్ అంపైర్ కాడర్ నౌని మాత్ర.. “బంతి బయట పడటానికి మీరు వేచి చూశారు. అది బయట పడ్డాక మీరు వెళ్లారు” అని అన్నారు. “అది ఇక్కడే ఉంది కానీ నేను దిగను. ఇగా, నేను దిగను. ఎందుకంటే నేను మీకు చెప్పాను. ఆట కంటిన్యూ చేయండి. ఆ తర్వాత వెళ్దాం. మీరు (తప్పు మార్క్‌ను చూపిస్తున్నారని) నేను చూశాను” అని అంపైర్ అన్నారు.

నేను అడిగితే రాలేదు

మ్యాచ్ లో స్వియాటెక్ వాదించలేదు. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. “నా పట్ల న్యాయంగా వ్యవహరించలేదు. అది న్యాయం కాదు’’ అని స్వియాటెక్ చెప్పింది. “అరీనా కోరినప్పుడు, బంతులు బయట పడినప్పుడు కూడా, ప్రతి మార్క్‌ను తనిఖీ చేయడానికి అతను దిగి వస్తున్నాడు. నాకు బయట ఉన్న మార్క్ ఉన్నప్పుడు, నా రిటర్న్ బయట పడిందని నేను చూశానని, నేను రిటర్న్‌ను ఫ్రేమ్ చేశానని అతను నన్ను ఒప్పించాడు’’ అని స్వియాటెక్ చెప్పింది.

ఇది న్యాయం కాదు

“బంతి బయట పడబోతుందని నాకు మొదటి నుంచీ తెలుసు. నేను బంతిని నిజంగా చూడలేదు. నేను మార్క్‌ను చెక్ చేయడానికి వెళ్ళా. మార్క్ బయట ఉందని నేను చూశాను. నేను అతన్ని దిగి రావాలని కోరుకున్నా. కానీ అతను దిగలేదు. కాబట్టి అది న్యాయంగా లేదని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా అరీనా అతన్ని అడిగిన ప్రతిసారీ అతను దిగి వచ్చినప్పుడు.. నేను అడిగితే ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు” అని స్వియాటెక్ పేర్కొంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం