Paris Olympics: రికార్డ్ బ్రేక్ చేసి బాయ్‌ఫ్రెండ్‌కు ఒలింపిక్ స్టేడియంలోనే ప్రపోజ్ చేసిన అథ్లెట్
Paris Olympics: ఫ్రెంచ్ అథ్లెట్ అలీస్ ఫినోట్ ఒలింపిక్స్ స్టేడియంలోనే బాయ్‌ఫ్రెండ్ ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది. బాయ్‌ఫ్రెండ్‌కు అథ్లెట్ ప్రపోజ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో 21 మిలియన్ల మంది వీక్షించారు.
Paris Olympics: ఈ సారి ఒలింపిక్స్ గేమ్స్ ఆది నుంచి వివాదాలతోనే కొనసాగుతోన్నాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల నుంచే విమర్శలు పెరిగిపోతున్నాయి. వివాదాలు మాత్రమే కాకుండా ప్రేమాయణాలకు ఒలింపిక్స్ వేదికగా మారుతోంది. ఇప్పటికే ఈ ఒలింపిక్స్ సాక్షిగా పలు ప్రేమజంటలు ఒక్కటయ్యాయి. అథ్టెటిక్స్ ఈవెంట్స్‌లో ఫ్రెంచ్ అథ్లెట్ రికార్డ్ బ్రేక్ చేసి ప్రియుడికి ప్రపోజ్ చేసింది.
3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్...
మూడు వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఫ్రాన్స్ తరఫున బరిలో దిగిన అలీస్ ఫినోట్ 8.58 సెకండ్లలోనే రేసును పూర్తిచేసింది. అతి తక్కువ టైమ్‌లో ఈ ఘనతను సాధించిన తొలి యూరోపియన్ అథ్లెట్‌గా నిలిచింది. రేసును పూర్తిచేసిన వెంటనే రేస్ డ్రెస్‌లోనే గ్యాలరీ వద్దకు వెళ్లిన అలీస్ మోకాళ్లపై కూర్చొని రింగ్ తీసి తన బాయ్‌ఫ్రెండ్ ట్రయథ్లాన్ అథ్లెట్ బ్రూనో మార్టినేజ్‌కు ప్రపోజ్ చేసింది.
ప్రియురాలు ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు మార్టినేజ్ సర్‌ప్రైజ్ తో పాటు ఎమోషనల్ అయ్యాడు. ఆనందం పట్టలేక అలీస్ ఫినోట్‌ను కౌగిలించుకున్నాడు. మార్టినేజ్‌కు అలీస్ ఫినోట్ ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఏకంగా 21 మిలియన్ల మంది వీక్షించారు.
రెండు సెకండ్ల ముందే...
కాగా తొమ్మిది నిమిషాల్లోనే రేసును పూర్తిచేస్తేనే బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేస్తానని అలీస్ ఫినోట్ స్నేహితులతో ఛాలెంజ్ చేసిందట. అనుకున్న టైమ్ కంటే రెండు సెకన్లు ముందే రేసును పూర్తిచేసి బాయ్‌ఫ్రెండ్‌కు దర్జాగా ప్రపోజ్ చేసింది. ఈ విషయాన్ని రేసు ముగిసిన అనంతరం అలీస్ ఫినోట్ స్వయంగా తెలిపింది. తొమ్మిది తన లక్కీ నంబర్ అని పేర్కొన్నది. యూరోపియన్ లీగ్‌లలో పలు పతకాలు సాధించింది అలీస్ ఫినోట్.
పతకం గెలవలేకపోయినా...
3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ ఈవెంట్‌లో అలీస్ ఫినోట్ పతకం మాత్రం రాకపోయిన ఆమె హైలైట్ అయ్యింది. ఈ ఒలింపిక్స్‌లో అలీస్ నోట్, మార్టినేజ్ మాత్రమే కాకుండా పలు జంటలు ప్రపోజల్స్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన లీ యూచేన్, హుయాంగ్ యాకియాంగ్ స్టేడియంలోనే ఎంగేజ్‌మెంట్ రింగ్‌లను ఒకరికొకరు మార్చుకున్నారు. అర్జెంటీనా అథ్లెట్ల్స్ కూడా ఒలింపిక్ వేదికగానే కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.