Salman Butt Praises Siraj: సిరాజ్ సూపర్ బౌలర్.. అదొక్క విషయంలో మెరుగవ్వాలి.. పాక్ మాజీ స్పష్టం-former pakistan cricketer salman butt says siraj needs to improve on bowling ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Former Pakistan Cricketer Salman Butt Says Siraj Needs To Improve On Bowling

Salman Butt Praises Siraj: సిరాజ్ సూపర్ బౌలర్.. అదొక్క విషయంలో మెరుగవ్వాలి.. పాక్ మాజీ స్పష్టం

Maragani Govardhan HT Telugu
Jan 26, 2023 09:04 PM IST

Salman Butt Praises Siraj: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్ అద్భుతమైన బౌలరని, కానీ ఒక్క విషయంలో మాత్రం అతడు మెరుగవ్వాలని స్పష్టం చేశాడు.

మహమ్మద్ సిరాజ్
మహమ్మద్ సిరాజ్ (PTI)

Salman Butt Praises Siraj: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదిరిపోయే ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తన అద్భుత ప్రదర్శన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఫలితంగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని సాధించాడు. అతడి బౌలింగ్ నైపుణ్యంపై పలువురు మాజీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ కూడా చేరిపోయాడు. అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడాడు.

ట్రెండింగ్ వార్తలు

"ఇటీవల కాలంలో అతడు(మహమ్మద్ సిరాజ్) అద్భుతంగా ఆడుతున్నాడు. అతడి వికెట్ టేకింగ్ సామర్థ్యం, నైపుణ్యం రోజు రోజుకు మెరుగవుతూ వస్తోంది. అన్ని ఫార్మాట్లకు అతడి దూకుడైన ఆట తీరు సూటవుతోంది. అతడు మెరుగుపరచుకోవాల్సింది ఇంకేమైనా ఉందంటే అది ఫీల్డింగ్‌లోనే. ఈ ఒక్క విభాగంలోనే అతడు కాస్త మెరుగైతే అద్భుతంగా రాణిస్తాడు. అతడు అద్భుతమైన బౌలర్." అని సల్మాన్ బట్ స్పష్టం చేశాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 2 వన్డేలో 5 వికెట్లు తీశాడు. కివీస్‌తో జరిగిన మూడో మ్యాచ్‌కు అతడికి విశ్రాంతి ఇచ్చారు. న్యూజిలాండ్ కంటే ముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో అదిరిపోయే ప్రదర్శన చేశాడు సిరాజ్. మొత్తంగా 9 వికెట్లు తన ఖాతాలో వేసుకుని ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను రోహిత్ సేన 3-0 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా వన్డేల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం టీమిండియా.. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. శుక్రవారం సాయంత్రం తొలి మ్యాచ్ జరగనుంది. హార్దిక్ పాండ్య భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతిని కల్పించారు.

WhatsApp channel