Ramiz Raja: రొనాల్డో డైట్ నాసా సైంటిస్ట్ ప్రిపేర్ చేస్తాడట.. లైవ్ టీవీలో పరువు తీసుకున్న పాక్ మాజీ కెప్టెన్-former pakistan captain ramiz raja says ronaldos diet prepared by nasa scientist ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ramiz Raja: రొనాల్డో డైట్ నాసా సైంటిస్ట్ ప్రిపేర్ చేస్తాడట.. లైవ్ టీవీలో పరువు తీసుకున్న పాక్ మాజీ కెప్టెన్

Ramiz Raja: రొనాల్డో డైట్ నాసా సైంటిస్ట్ ప్రిపేర్ చేస్తాడట.. లైవ్ టీవీలో పరువు తీసుకున్న పాక్ మాజీ కెప్టెన్

Hari Prasad S HT Telugu
Published Nov 23, 2023 03:03 PM IST

Ramiz Raja: రొనాల్డో డైట్ నాసా సైంటిస్ట్ ప్రిపేర్ చేస్తాడంటూ లైవ్ టీవీలో పరువు తీసుకున్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రమీజ్ రాజా
రమీజ్ రాజా (Action Images via Reuters)

Ramiz Raja: పాకిస్థాన్ టీమ్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ ఛీఫ్ రమీజ్ రాజా లైవ్ టీవీ డిబేట్ లో పరువు తీసుకున్నాడు. స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో రోజువారీ డైట్ ను ఓ నాసా సైంటిస్ట్ సిద్ధం చేస్తాడంటూ అతడు చెప్పడం గమనార్హం. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ప్రదర్శనపై ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న రమీజ్.. ఈ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సునో న్యూస్ తో మాట్లాడిన రమీజ్ రాజా.. "ఫుట్‌బాల్ నే తీసుకోండి.. రొనాల్డో డైట్ ను నాసా సైంటిస్ట్ ప్రిపేర్ చేస్తాడు" అని అన్నాడు. దీనికి పక్కనే ఉన్న యాంకర్ కూడా అవును అని అనడం విశేషం. ఈ వీడియో చూసి అభిమానులు రమీజ్ ను ట్రోల్ చేస్తున్నారు. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ అయిన క్రిస్టియానో రొనాల్డో.. ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్స్ లో ఒకడిగా పేరుగాంచాడు.

అలాంటి ప్లేయర్ గురించి రమీజ్ ఈ కామెంట్స్ చేయడం షాక్ కు గురి చేస్తున్నాయి. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వైఫల్యాలపై చర్చిస్తూ రమీజ్.. రొనాల్డో ఉదాహరణ చెప్పాడు. పాక్ ఓటమిలో కెప్టెన్ బాబర్ ఆజం తప్పేమీ లేదంటూ మొదటి నుంచీ వెనకేసుకొస్తున్న రమీజ్.. పాక్ క్రికెట్ ఎక్కడ మెరుగవ్వాల్సిన అవసరం ఉందో ఈ చర్చలో వివరించాడు.

అయితే ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ ఫిట్‌నెస్ గురించి ఓ సాధారణ అభిమాని మాట్లాడినట్లు గతంలో ఓ నేషనల్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా చేసిన వ్యక్తి మాట్లాడటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మధ్యే మరో పాక్ మాజీ ప్లేయర్ హసన్ రజా కూడా వరల్డ్ కప్ లో ఇండియా వరుస విజయాలపై నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఇండియన్ బౌలర్లకు వేరే బాల్స్ ఇస్తున్నారని, డీఆర్ఎస్ ను తారుమారు చేస్తున్నారని నోటికొచ్చినట్లు వాగాడు.

దీనిపై ఆ దేశంలోనే విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా అతనిపై మండిపడ్డారు. తమ పరువు తీయొద్దని అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇప్పుడు రమీజ్ చేసిన ఈ సిల్లీ కామెంట్స్ పై వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Whats_app_banner