ఐపీఎల్(IPL) మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. కరోనా(Corona)తోపాటుగా న్యూమోనియా కూడా ఆయనకు సోకింది. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్‌పై చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే.. స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో వెల్లడించారు. వారంలో రెండుసార్లు తనకు కోవిడ్ వచ్చినట్టుగా వెల్లడైందని తెలిపారు. న్యూమోనియా కూడా త్రీవంగా ఉందని, ఈ కారణంగానే ఆసుపత్రికి వచ్చినట్టుగా వెల్లడించారు.,గత ఏడాది బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసి వార్తల్లో నిలిచారు లలిత్. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి గురించి అప్డేట్ ఇచ్చి మళ్లీ వార్తల్లో నిలిచారు. గత రెండు వారాల్లో రెండుసార్లు కరోనా సోకిన లలిత్ మోదీ(Lalit Modi) న్యుమోనియాతో కూడా బాధపడుతున్నారు. కృత్రిమ ఆక్సిజన్ సాయంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.,మూడు వారాల నిర్బంధం తర్వాత మెక్సికో నుండి లండన్‌కు తరలించినట్లు లలిత్ పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇవ్వడమే కాకుండా.. ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒకదాని వెనుక ఒకటిగా ఐదు ఫోటోలను పోస్ట్ చేస్తూ, తనకు బాగా చికిత్స చేసిన ఇద్దరు డాక్టర్లు, తన కొడుకుతో కలిసి ఎయిర్ అంబులెన్స్‌లో లండన్‌లో దిగినట్లు మోది పేర్కొన్నారు. లలిత్ మోదీ పోస్ట్ చూసిన తర్వాత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ లలిత్ మోదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.,గత ఏడాది బాలీవుడ్ నటి సుస్మితా సేన్(sushmita sen)తో తనకున్న సంబంధాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నందుకు లలిత్ మోదీ వార్తల్లో నిలిచారు. అలాగే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ నటి సుస్మితా సేన్ మాత్రమే ఈ పుకార్లను పూర్తిగా ఖండించింది. అదంతా అబద్ధమని పేర్కొంది. లలిత్ మోదీ, సుస్మితా సేన్ ఇద్దరూ కలిసి చాలా రోజులుగా ఫోటోలు పోస్ట్ చేయకపోవడం, ఏ పబ్లిక్ ఈవెంట్‌లలో కలిసి కనిపించకపోవడంతో ఈ జంట విడిపోయినట్లుగా అనుకుంటున్నారు.