Ravichandra Ashwin Post Viral: దర్శక దిగ్గజం మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ 1. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి పార్ట్ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రఖ్యాత తమిళ నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా చూసేందుకు సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూశారు. ఇందుకు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మినహాయింపేమి కాదు.
ఆదివారం నాడు సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడనున్న సందర్భంగా ప్రస్తుతం టీమిండియాతో పాటు గువహటిలో ఉన్నాడు అశ్విన్. దీంతో ఈ సినిమా చూసేందుకు గువహటిలో పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఎక్కడ ఆడుతుందో ఆరా తీశాడు. తనకు సాయం చేయాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను కోరాడు. ఫలితంగా సదరు సినిమా నగరంలో ఏ థియేటర్లో ఆడుతుందో స్క్రీన్ షాట్ రూపంలో ఓ అభిమాని అశ్విన్‌కు తెలియజేశాడు. అయితే అశ్విన్ మాత్రం సినిమాను ఆ సమయంలో తను సినిమా చూడలేనని, తనకు అప్పుడే ప్రాక్టీస్ ఉండటంతో సినిమా చూసేందుకు అవకాశం లభించదని అభిమానికి బదులిచ్చాడు.
ఈ ట్వీట్‌కు అభిమాని.. అయతే ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టాల్సిందని, కావాలంటే తను కోచ్‌ను అనుమతి అడుగుతానని అశ్విన్‌కు రిప్లై ఇచ్చాడు. దీంతో అశ్విన్ విరగబడి నవ్వుతూ ఉన్న స్మైలింగ్ ఎమోజీలతో తన స్పందనను తెలియజేశాడు.
ప్రస్తుతం టీమిండియా.. దక్షిణాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా గువహటి చేరుకుంది. బుధవారం నాడు జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్లేమి తీయకుండా 8 పరుగులు సమర్పించాడు. ఇందులో ఓ ఓవర్ మెయిడెన్‌తో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఫలితంగా మ్యాచ్‌ను భారీ తేడాతో గెలిచింది భారత్. దీంతో రెండో టీ20లోనై ప్రతాపం చూపించాలని సౌతాఫ్రికా భావిస్తుండగా.. ఇదే ఆధిపత్యాన్ని తిరిగి కొనసాగించాలని భావిస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్