Fact Check : మోదీ స్టేడియంలో పిచ్‌ను ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్, ఐరన్ బాక్స్ ఉపయోగించారా?-fact check hair dryer and electric iron used to dry narendra modi stadium in ipl 2023 final photos goes viral ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Fact Check Hair Dryer And Electric Iron Used To Dry Narendra Modi Stadium In Ipl 2023 Final Photos Goes Viral

Fact Check : మోదీ స్టేడియంలో పిచ్‌ను ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్, ఐరన్ బాక్స్ ఉపయోగించారా?

వైరల్ అవుతున్న ఫొటోలు
వైరల్ అవుతున్న ఫొటోలు (twitter)

Narendra Modi Stadium : CSK vs GT మ్యాచ్ సమయంలో పిచ్ ను ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్, ఐరన్ బాక్స్ ఫోటోలను ఉపయోగించారని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత?

ఐపీఎల్(IPL 2023) ఫైనల్ మ్యాచ్ సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ( CSK vs GT ) మధ్య ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. సోమవారం నిర్వహించారు. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైంది. కాగా, పిచ్‌ను ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్‌లు, ఐరన్‌లు వాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

మే 29న CSK Vs GT జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆకస్మిక వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత, నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌ను ఆరబెట్టడానికి గ్రౌండ్ సిబ్బంది స్పాంజ్‌లను ఉపయోగించడం కనిపించింది. వీటన్నింటి మధ్య, పిచ్‌పై హెయిర్ డ్రైయర్, ఐరన్ బాక్స్‌ని ఉపయోగిస్తున్న పాత చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'BCCI వద్ద తగినంత నిధులు ఉన్నాయి, కానీ ఇక్కడ సరైన పరికరాలు లేకపోవడం సిగ్గుచేటు' అని ఓ ట్వీట్లు చేశారు.

అయితే CSK vs GT మ్యాచ్ సమయంలో హెయిర్ డ్రైయర్(Hair Dryer), ఐరన్ బాక్స్ ఫోటోలతో పిచ్‌ను ఆరబెట్టడం లేదు. ఈ ఫోటోలు 2020లో గౌహతిలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లోవి అని తెలుస్తోంది. హెయిర్ డ్రైయర్ ఇమేజ్.. గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. జనవరి 2020లో ప్రచురించబడినవిగా గుర్తించారు. శ్రీలంకతో టీ20కి ముందు గౌహతి పిచ్‌ను ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్‌లు, స్టీమ్ ఐరన్‌లను ఉపయోగించారు.

గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో పిచ్‌ను ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్‌లు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలను ఎలా ఉపయోగించారో గతంలోనే వార్తలు పబ్లిష్ అయ్యాయి. అయితే అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్ రద్దయింది.

WhatsApp channel

టాపిక్