ఇంగ్లాండ్ లెెజెండరీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ప్రతిష్ఠాత్మక అవార్డు సొంతం చేసుకున్నాడు. నైట్‌హుడ్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. దీంతో అతను సర్ అనే బిరుదు పొందాడు. సర్ అండర్సన్ గా మారాడు. ఈ అవార్డు సొంతం చేసుకున్న 13వ ఇంగ్లాండ్ క్రికెటర్ గా అండర్సన్ నిలిచాడు.
గత ఎన్నికల్లో దారుణ పరాజయంలో రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రిషి సునాక్ రిసిగ్నేషన్ హానర్స్ లిస్ట్ లో అండర్సన్ పేరు కూడా ఉంది. మాజీ పీఎం రిషి జాబితా ప్రకారం అండర్సన్ కు నైట్‌హుడ్ పురస్కారం దక్కింది.
నైట్‌హుడ్ పురస్కారాన్ని పొందిన ఇంగ్లాండ్ లెెజెండ్ క్రికెటర్ల సరసన అండర్సన్ చేరాడు. ఈ అవార్డు సొంతం చేసుకున్న 13వ ఇంగ్లిష్ ఆటగాడు అతను. ఈ లిస్ట్ లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు అలిస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్ లాంటి వాళ్లు ఉన్నారు.
2000 తర్వాత నైట్‌హుడ్ అవార్డు దక్కించుకున్న అయిదో ఇంగ్లాండ్ క్రికెటర్ అండర్సన్. ఇయాన్ బోథమ్ (2007), బాయ్ కాట్ (2019), కుక్ (2019), స్ట్రాస్ (2019) అతని కంటే ముందున్నారు.
ఇంగ్లాండ్ టాప్ వికెట్ టేకర్ గా అండర్సన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రైటార్మ్ పేసర్ టెస్టుల్లో 704 వికెట్లు పడగొట్టాడు. ఈ సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా అండర్సన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. వన్డేల్లో 269 వికెట్లు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
42 ఏళ్ల అండర్సన్ ఈ ఏడాది ఐపీఎల్ లో ఆడటం కోసం వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ అతణ్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ కూడా ఇంట్రస్ట్ చూపలేదు. కానీ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఇంజూరీ కారణంగా ఈ సీజన్ కు దూరమయ్యాడు.
సంబంధిత కథనం